19, డిసెంబర్ 2011, సోమవారం

'జన గణ మన' కు వందేళ్ళు

భారత స్వాతంత్రోద్యమంలో ప్రజల్లో దేశభక్తిని రగిలించి, దేశ దాస్య శృంఖలాలు తెంచుకునే దిశగా వారిని కార్యోన్ముఖులను చేసిన 'జన గణ మన' వందేళ్ల సంబరాలు జరుపుకొంటోంది. దేశ ప్రజలంతా సగర్వంగా పాడుకునే ఈ జాతీయ గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన సంగతి తెలిసిందే. ఈ గీతం తొలి ఆలాపనకు డిసెంబర్‌ 27తో వందేళ్లు పూర్తవుతాయి. ఆంగ్లేయుల చెర నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు జాతీయోద్యమం సాగిన తరుణంలో 1911 డిసెంబర్‌ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల్లో 'జన గణ మన' గీతాన్ని తొలిసారి ఆలపించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ 'జనగణ మన'ను జాతీయ గీతంగా ఆమోదించింది.

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి