12, మార్చి 2012, సోమవారం

రాజకీయ వంశాల మధ్య అధికార పోరాటం!



గడచిన మూడు నెలల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో ఏకకాలంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో మొదటిది అసెంబ్లీలో స్థానం సంపాదించేందుకోసం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య జరిగిన పోరాటం. ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు కోసం వివిధ రాజకీయ పార్టీల మధ్య జరిగే పోరాటం రెండవది. ఇక మూడవది, ముఖ్యమంత్రి పదవికోసం వివిధ ఆశావహుల మధ్య జరిగిన పోరాటం. మరి బయటి ప్రపంచంలో చాలా భాగానికి మాత్రం, అంచనాలు వేయడానికి అనువైన నాలుగవ పోరాటం! మొత్తంమీద చెప్పాలంటే రెండు రాజకీయ వంశాలకు చెందిన వారసుల మధ్య పైకి కనిపించని పోరాటం, ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికలను మరింత ఆసక్తిరంగా మార్చాయని చెప్పవచ్చు. మరి ఈ ఇద్దరు వంశాంకురాలు ఎవరంటే, ఒకరు రాహుల్ గాంధీ కాగా మరొకరు అఖిలేష్ యాదవ్!
 మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లోమాత్రం సమాజ్‌వాదీ పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాల్లో గెలుపొందడం ద్వారా, 1985 నుంచి ఇప్పటి వరకు అత్యుత్తమ పనితీరు కనబరచిన పార్టీగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. పార్టీకి ఇంతటి సునాయాస విజయం వెనుక అసలు రహస్యం అఖిలేష్ యాదవ్! ములా యం సింగ్ కుమారుడు. నెహ్రూ- గాంధీ కుటుంబ వారసుడైన రాహుల్ గాంధీని దీటుగా ఎదుర్కొని, కాంగ్రెస్‌ను మట్టికరిపించాడు. ఇదిలావుండగా అంతకుముందు కాఫీ షాపులు, చాయ్ దుకాణాల్లో మీడియా ప్రతినిధులు ఆసక్తికరంగా జరిపినచర్చల్లో, రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి అంతర్గతంగా వీస్తున్నదంటూ అంచనాలు వేయడం మొదలెట్టారు. ఇక అటువంటి వారంతా ఇప్పుడు బాణీ మార్చి, అఖిలేష్ భజన చేయడం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న యువ భారత్‌కు ఆయనే ప్రతినిధి అంటూ ఆకానికెత్తేశారు. ఎన్నికల ముందు ఒకరకంగా, ఫలితాలు వెలువడిన తర్వాత మరో రకంగా ప్రవర్తించిన వీరి వ్యవహారశైలిని ఏమని ప్రశ్నించాలి?
 రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరిపిన సుడిగాలి పర్యటనలు, నిర్వహించిన ర్యాలీలను పరిశీలించిన కొందరు, కాంగ్రెస్‌కు కనీసం వందసీట్లయినా వస్తాయని అంచనా వేసారు. కానీ విధి ఓటర్ల రూపంలో మరోలా తలచింది. దీంతో తమ అంచనాలు తల్లక్రిందులయిన వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయవుంటారు. చాలామంది వ్యాఖ్యాతలు, రాజకీయ పండితులు..ఉత్తముడైన మన్మోహన్ సింగ్ అందించే ఎటువంటి స్ఫూర్తిదాయకం కాని పరిపాలనకు ఎప్పుడో ఒకప్పుడు చరమగీతం పాడక తప్పదని ప్రకటించేశారు కూడా! అయితే ఔత్యాహిక కాంగ్రెస్ దిగ్గజాలను విచారించిన తర్వాత, పైకి కనిపించని ఒక పగులును వీరు అకస్మాత్తుగా కనుగొన్నారు. అటువంటి కాంగ్రెస్ నేతలు, రాజకీయ వాస్తవాలను, రాజవంశానికి చెందిన విధేయతతో సంతులనం చేయడానికి యత్నించారు. మరి మనదేశంలో అంతా భావిస్తున్నట్టుగా కాంగ్రెస్‌లో ప్రథమ కుటుంబానికి చెందినవారికి..తాము పెట్టిన అత్యధిక పెట్టుబడులకు వచ్చిన అతికొద్ది ఫలితం ఆగ్రహాన్ని, కలవరాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే, ఒక కాలికి, మరోకాలు బూటు ధరించినప్పుడు ఎట్లా వుంటుందో.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల వ్యక్తమయ్యే ప్రతిస్పందనలు సరీగ్గా అదేవిధంగా మరింత ఉధృతంగా ఉండటం సహజమేకదా! ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధించివున్నట్లయితే దాన్ని, జింబాబ్వేపై, ఇండియా గెలిచిన విధంగా, అఖిలేష్‌పై రాహుల్ విజయం సాధించాడంటూ ఊదరగొట్టి ఉండేవారు.
 ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆత్మరక్షణా పథంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ఎప్పుడూ ‘జాతీయ కోణం’లో చూడాలి కానీ, అఖిలేష్ వంటి ‘ప్రాంతీయ స్థాయి’ నాయకుడితో పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో చూసినప్పుడు రాహుల్‌కు, అఖిలేష్‌కు ఎవరిస్థానం వారికే ఉంటుంది. అఖిలేష్ ఇష్టాయిష్టాలనేవి తప్పనిసరి అవసరాలని, నవీన్ పట్నాయక్ భావిస్తున్నారు. అంటే రాహుల్ భారత్‌ను తప్పనిసరిగా ఏలాలి! ఇక యాదవ్, బాదల్, పట్నాయక్ కుటుంబాలు ఆయా రాష్ట్రాలకు పరిమితం కావాలి. కానీ ఇక్కడ రాహుల్ గాంధీని సమర్ధించే సమయంలో తాను తెలివితక్కువగా వెనక్కి వెళుతున్నానన్న సంగతి దిగ్విజయ్ సింగ్ మరిచిపోవడం విచిత్రం. నిజం చెప్పాలంటే ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోలేనంత దృఢంగా పట్టుకొని కూర్చున్నారనే చెప్పాలి. ఇక్కడ ఆయనకు ఇతరులపై ముందుగానే విమర్శలకు దిగాలన్న ఉద్దేశంలేదు. కేవలం దేశ పరిపాలన, రాహుల్ గాంధీ అదృష్టం..ఈ రెండూ విడదీయడం సాధ్యం కానంతటి స్థాయిలో ఒకదానితో మరొకటి పెనవేసుకొనిపోయాయ. ఈ రెండింటిలో ఒకటి లేకపోతే మరొకటి లేదనేది నిష్టుర సత్యమన్న అంశాలను చెప్పడమే దిగ్విజయ్ సింగ్ ముఖ్యోద్దేశం.
 తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా రెండు విభిన్న మనస్తత్వాలు గట్టి పరీక్షను ఎదుర్కొన్నాయనే చెప్పాలి. కాంగ్రెస్, బిజెపిలు.. పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం దెబ్బకు ఒక్కసారి దిమ్మెరపోయాయి. పదిహేను సంవత్సరాల క్రితంనాటి ఉత్తరప్రదేశేనా ఇది.. అనే సంభ్రమాశ్చర్యాలనుంచి అవి ఇంతవరకు తేరుకోలేదు. నాటి ఉత్తరప్రదేశ్ జాతీయ స్థాయికి సమానంగా ఉండగా, నేడు కేవలం ప్రాంతీయ స్థాయికి దిగజారిపోయిందని అవి భావిస్తున్నాయి.
 దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఆకస్మికంగా సంకుచితంగా, ప్రాంతీయతత్వంవైపునకు మొగ్గు చూపిందేమిటనే వారి వాదన, భారత భావనను మరింత విస్తృత కోణంలో ఆలోచించినప్పుడు..ఎంతో నిర్లక్ష్య పూరితమైందని చెప్పక తప్పదు. గడచిన మూడు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం భారత్‌లో మరింత ఐక్యత కనిపిస్తుంది. గతకాలపు భారత చరిత్రను తిరగేస్తే ఇప్పుడు ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్ళడం బాగా ఎక్కువయింది. గతంతో పోలిస్తే గ్రామీణ భారతంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉత్తమ సమాచార సదుపాయిలు, మీడియాకు అందుబాటు, జాతీయ మార్కెట్ ఆవిర్భావం వంటివి ప్రస్తుతం మనకు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి ఢిల్లీ.. ఇంకా దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ ముప్పయ్యేళ్ళ క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడా దూరం తగ్గిపోయిందనే చెప్పాలి. బాలీవుడ్, క్రికెట్ నుంచి ఉగ్రవాదం వరకు, జాతీయ స్థాయిలో నేటి 25 సంవత్సరాల యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి తాత ముత్తాతలు ఎదుర్కొని ఉండలేదు!
 ఈ తర్కాన్ని బట్టి అయినా భారత్, రాజకీయంగా 25 వివిధ దేశాలుగా కాకుండా, ఒకే పతాకం, ఒకే రాజ్యాంగం కింద ఒకే దేశంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినప్పటికీ, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంతో, ఇంకా నిలదొక్కుకోవడానికి యత్నిస్తున్న నేటి రాహుల్ గాంధీ కాలాన్ని పోలిస్తే, ఎంతో సంక్లిష్టత కనిపిస్తుంది. నేటి రాహుల్‌కు ఉన్నన్ని సమస్యలు నాటి ఇందిరకు లేవు! నిజం చెప్పాలంటే ఇందంతా ఒక విరోధాభాస! నేడు భారత్ విభిన్న కోణాల్లో, విభిన్న గొంతులతో మాట్లాడగలదు! మరి ఈ దృగ్విషయానికి వివరణ ఇచ్చే బాధ్యతను మేధావులకు అప్పగించడమే ఉత్తమం. ఒకే పరిమాణం కలిగినది అన్నింటికీ సరిపోతుందనే భావనకు గతంలో వ్యతిరేకత ఉండేది. కానీ అది తప్పనే భావన త్వరలోనే మన మనసుల్లోనుంచి తొలగిపోనుండటం అతిముఖ్యమైన అంశం. నేటి రాజకీయాలను అర్థం చేసుకోవడానికి పైవిషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జాతీయ సలహామండలి, మెగా సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇవి నిస్సహాయ సంఘర్షణను లోనుగాక తప్పదు. ఎందుకంటే పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఏకకాలంలో వీటిని అమలు పరచడం సాధ్యంకాదు. మరి వీటిని ప్రణాళికాసంఘం, భారతీయ కాస్మోపాలిటన్ చైతన్యవంతులు అంతగా మెచ్చుకోవడంలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రథమ కుటుంబం మాత్రం వీటిని ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. వారు నెహ్రూ కాలంనుంచి ఇంకా బయటపడకపోవడమే అందుకు కారణం! ఇక్కడ మరింతగా చెప్పాలంటే రాజకీయంగా జాతీయత అనే విశాల దృక్పథం అనేది చాలా సౌకర్యవంతమైనదే కాకుండా, ప్రాంతీయ ప్రతిధ్వనుల్లో వేళ్ళూనుకొని వున్న చురుకుదనానికి ప్రత్యామ్నాయం కాగలదు. ఒకానొక సమయంలో జాతీయతా భావానికి, సమాఖ్య వ్యవస్థనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవం. భారత ‘సమైక్యత, సమగ్రత’ అనే వాటితో రాజీపడాల్సి రావడమే అందుకు కారణం. రాజ్యాంగంలో సమాఖ్య లక్షణమున్నప్పటికీ జాతీయ భావానికే ఎక్కువ ప్రాధాన్యత. లేని పక్షంలో దేశ సమైక్యతకు విఘాతం కలుగుతుంది. అయతే నేడు భారత జాతీయత మరింత భద్రంగా, తక్కువ రిమోట్ సామర్ధ్యం ఎక్కువ జవాబుదారీ తనంతో కూడి ఉంది. అందువల్లనే జాతీయ స్థాయిలో వంశపారంపర్యతను అత్యవసరం చేసిన అంచనాలను ఈ స్పందనలు, ఏవిధంగా ప్రశ్నించకుండానే సవాలు చేసాయి. వీటన్నింటితో ఏమాత్రం సంబంధం లేని శక్తుల బాధితుడిగా రాహుల్ గాంధీ మిగిలే అవకాశాలే ఎక్కువ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి