12, మార్చి 2012, సోమవారం

టాలీ టాక్



‘దేశముదురు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక తాజాగా ‘డ్రీమ్‌గర్ల్’ బిరుదును కూడా పొందింది. తమిళంలో అవకాశాలు బాగా ఉండడంతో ప్రస్తుతం చెన్నైలోనే మకాం పెట్టింది. అయితే బయటి కార్యక్రమాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతోందట. పబ్లిక్ ఫంక్షన్లకు ససేమిరా రానంటోంది. దానికి కారణం. గతంలో రెండుసార్లు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పబ్లిక్‌లోకి వెళ్లినందుకు, వారినుంచి తప్పించుకోవడానికి నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి ఆ బాధ పడలేక అభిమానులా? మృగాలా? అనే కోపంతో రెచ్చిపోయి ఇంటికి వచ్చింది. తాజాగా బౌన్సర్లను తన రక్షణ నిమిత్తం రిక్రూట్ చేసుకుందటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చేయి వేయటానికి కూడా ఎవరూ సాహసించటం లేదట. ఈ మార్పును చూసి ఇక తనను ఎవరూ తాకే ప్రయత్నం చేయరని, పూర్తి సంతృప్తితో పబ్లిక్ ఫంక్షన్లకు వెళుతోంది. అది కథ!

హిట్ కొట్టడం గొప్పకాదు !

‘ఏమాయచేసావే - దూకుడు’ చిత్రాల వరకు సమంత కెరీర్‌గ్రాఫ్ పైపైకి పోయి తారాస్థాయికి చేరింది. టాప్‌స్టార్‌గా గుర్తించబడిన సమంత ఇప్పుడు ఆ పేరును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటోంది. హిట్ కొట్టడం గొప్పకాదు. నెంబర్ తారగా నిలబడి కెరీర్‌ను అలాగే సాగించడం చాలా కష్టమంటోంది. తమిళ, తెలుగు చిత్రాలు చేయడం ఇబ్బందిగా ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నానంటోంది. బాలీవుడ్‌పై ఆశ ఉన్నా పైకి మాత్రం అలాంటి కోరికలు ఏమీ లేవంటూ చెబుతూ, ప్రస్తుతం తన దృష్టంతా దక్షిణాది చిత్రాలపైనే ఉందంటోంది. కారణం - టాప్ హీరోయిన్‌గా తనకంటూ కొంత బాధ్యతలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. కనుక టాప్ హీరోయిన్ అనే మాటను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ తన కెరీర్‌ను మలచుకుంటున్నానని వివరించింది. ఓకే చక్కన్నమ్మ అన్ని భాషల్లో చిక్కుతానంటే ఎవరు కాదంటారు?

వదలనే వదలను
 ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని నాకనుకూలంగా మార్చుకోవడంలో నా స్టైలే వేరంటోంది తమన్నా. తాజాగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మహేష్‌బాబుతో నటించే అవకాశం సుకుమార్ దర్శకత్వంలో వచ్చింది. కానీ కాల్షీట్లన్నీ బిజీ అవటంతో ఆలోచనలోపడిపోయింది. అయినా కానీ మహేష్‌బాబు కోసమైనా సరే కాల్షీట్లు సర్దుబాటు చేయడానికి తయారైంది. అయితే కాల్షీట్లు లేకపోవడంతో తమన్నా ఆ చిత్రంలో చేయడంలేదని రూమర్‌కి ఫుల్‌స్ట్ఫా పెట్టడానికి తానే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దొరక్క దొరక్క దొరికిన ఈ అవకాశాన్ని అంత సులభంగా వదులుకుంటానా? ఇప్పుడున్న కాల్షీట్ల స్థానంలో ఆయా నిర్మాతలను బ్రతిమిలాడైనా సరే చేస్తానంటోంది. మొత్తానికి మరోమారు క్రేజీ కాంబినేషన్ మనం చూడబోతున్నామన్నమాట.!!

1 కామెంట్‌: