తెలుగు సినిమాకు ‘పరీక్షా’కాలం ఇది. ఒకపక్క ఇంటర్ పరిక్షలు, మరో పక్క ముదురుతున్న వేసవితో పరిస్థితి వేడెక్కింది. అయినా రెండు మూడు డబ్బింగ్ సినిమాలు, మరో రెండు చిన్న చిత్రాలు, ఇవికాక హిందీ, ఇంగ్లీషుతో కలిపి దాదాపు అరడజనకు పైగానే సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి.
వీటిలో ముఖ్యమైనవి నటుడు కార్తీ నటించిన తొలిసినిమా తెలుగు వెర్షన్ మల్లిగాడు. రెండవది ఆది పినిశెట్టి నటించిన వసంత్‌బాలన్ సినిమా ఏకవీర. చిత్రమేమిటంటే, రెండూ పూర్తిగా తమిళ నేటివిటీ నేపథ్యంలో తీసినవే. మల్లిగాడు చిత్రం ఓపెనింగ్స్ వరకు ఓకె. ఇక ఏకవీర సెకెండాఫ్ ప్రేక్షకులకు కాస్త భారమైంది. మిగిలిన సినిమాలన్నీ కూడా సోసోనే. మొత్తానికి సీజన్‌కు తగిన సినిమాలే అనిపించుకున్నాయి. సినిమా లేకుంటే కాలక్షేపం కాని జనాలే ఈ సీజన్‌లో థియేటర్లకు ఎక్కువగా వచ్చేది కాబట్టి.
మరో మూడు వారాల తరువాత థియేటర్లు ఎలాగూ దొరకడం కష్టం అన్న కారణం, పెద్ద సినిమాలు లేవు కాబట్టి, కాస్త నాలుగు డబ్బులు చేసుకోవచ్చు అన్న మరో కారణంతో కాస్త ఎక్కువ సినిమాలే వచ్చాయి. మరో వారం కూడా ఇదే పరిస్థితి వుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి