సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.
ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.
ఎక్కడయితే శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.
ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.
ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.
ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.
ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది ఏ ఐన్ స్టీను కనుక్కోలేదు.
ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.
ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు.
ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.
ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు ఒకేలా వుండేది.
teluguquotations.blogspot.in numde ee quotations vadukunnaru.. kanisam courtesy kaina kina peru vesthe baguntundi
రిప్లయితొలగించండి