14, జనవరి 2012, శనివారం

బెజవాడ అంటే ఇదా!

 

 

ఓ బెజవాడ అభిమాని ఆక్రోశం

ఈ మధ్య విడుదలయిన 'బెజవాడ' తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని  ఆయన మాటల్లోనే -

"సార్! బెజవాడ సినిమా చూసారా. బెజవాడ అంత భయంకరంగా  ఉంటుందా. రోడ్లమీద

రవుడీలు అలా కత్తులు పట్టుకొని చంపుతామంటూ తిరుగుతారా?   నడిరోడ్లమీదే జనాలను అంత అమానుషంగా  రక్తసిక్త మయ్యేలా చంపేస్తారాబాబోయి!" అంటూ అని విశాఖపట్నం నుంచి నాతో వొకప్పుడు

కలిసి పనిచేసిన ప్రకాష్ ఫోన్ చేసాడు.

"నేను సినిమాలు  చూడడం దాదాపు మానేశాననే చెప్పాలి.

ఎప్పుడేనా వో మంచి సినిమా వస్తే ఇంట్లో వాళ్ల  బలవంతం మీదా ఏడాదికి ఒక్కటో

రెండో చూస్తాను. అదీ హాయిగా నవ్వుకొనే సినిమా అయితేనే.

"ఇప్పుడు బెజవాడ పేరుతొ  సినిమా తీసారని తెలిసి ఆ సినిమా  మీద

రోజూ ఛానల్స్ లో వచ్చే చర్చలు అప్పుడప్పుడు చూస్తున్నాను, గోడలమీద వాల్ పోస్టర్లు, హోర్డింగులు

కూడా చూస్తూనే వున్నాను.  నిజంగానే భయంకరంగా వున్నాయి. వాటిని చూస్తుంటే  నా బెజవాడ ఇది కాదు అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది.

"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే  వ్యక్తుల మధ్య రగిలే పగలు,సెగలు ఇవాళ  బెజవాడ అంటే. బహుశా దాన్ని  విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో.

"నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన  బెజవాడ మాత్రం  కాదు.

"నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు  పేరు.

 "అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,

డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.

"సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మమద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావుశ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు

"సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ  వంటి కవి పండిత శ్రేష్ఠులుపరిశ్రమలతో పాటు  ధార్మిక సంస్థలు నెలకొల్పిన  చుండూరు  వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ  రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు

కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,

కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -   బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.

"ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని   అద్దంకి

శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యపబి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,

కర్నాటి లక్ష్మినరసయ్యసీడీ  కృష్ణమూర్తి,   నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావుప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి

శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రిచక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల

నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డిఏబీకె ప్రసాద్,   పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు -  వీరిదీ  బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!

"ప్రభాకర ఉమామహేశ్వర పండితుల  ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి  లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావునవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి  ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే  నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.

 

"టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి  లక్ష్మీ జనరల్ స్టోర్స్వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు  శ్రీ రామనవమి  పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.

 

" తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లాబోడెమ్మ హోటల్న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్అలంకార్  సెంటర్మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళుజెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే  జనం ఇవీ బెజవాడ  అంటే.

"లీలా  మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు  రోడ్డు  సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసెదుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీంపుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల  హల్వారామచంద్రరావు హోటల్లో  అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,  కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలంసీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక  శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమాజైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసుఎప్పుడూ  హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.

"రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయందివ్యజ్ఞాన  సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో  గోపికలతో  సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా  కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ  మునిసిపల్ హైస్కూల్సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.

 

"అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో  ఎందుకు చెప్పాలో  తెలియనివాళ్లు తీసిన 'బెజవాడసినిమా చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.

"మా బెజవాడ చాలా గొప్పది.

"అరవ వాళ్లకి  మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది."

10, జనవరి 2012, మంగళవారం

తమిళంలో బిజినెస్‌మేన్‌

మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్లో వస్తున్న 'బిజినెస్‌మేన్‌' తమిళంలోకి కూడా అనువదిస్తున్నారు. ఈ తమిళ సినిమా డబ్బింగ్‌ రైట్స్‌ స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత జ్ఞానవేల్‌ రాజా సొంతం చేసుకున్నాడు. డబ్బింగ్‌ వెర్షన్‌ పంపిణితోబాటు తమిళ రీమేక్‌ రైట్స్‌ కూడా ఆయనే తీసుకున్నాడట. ఇంతకీ ఈ జ్ఞానవేల్‌ రాజా ఎవరా ! అని అనుకుంటున్నారా !...మరెవరో కాదు...తమిళ హీరోలు సూర్య, కార్తీల సోదరుడు. ఓపక్క డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకుని, మరొపక్క రీమేక్‌ రైట్స్‌ కూడా తీసుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందని అంటున్నారు. ఒకవేళ తెలుగులో సినిమా పెద్ద హిట్‌ అయితే, తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ ఆపేస్తారన్నమాట. అప్పుడు ఈ సబ్జెక్ట్‌ను తీసుకెళ్లి సూర్యతో రీమేక్‌ చేయాలన్నది ఆలోచన. ఒకవేళ బిజినెస్‌మేన్‌ మామూలు రేంజ్‌ సినిమా అయితే, డబ్బింగ్‌ వెర్షన్‌తో జ్ఞానవేల్‌ రాజా సరిపెడతాడు. అదీ సంగతి !

బ్రాండ్‌ అంబాసిడర్‌గా 'పోకిరి'

ప్రభుత్వ పథకాల ప్రమోషన్‌కు ఉపయోగించుకునే యోచనలో కిరణ్‌

 కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న నేతలు

 చిరంజీవికి పోటీ కోసమేనా..?

 

 

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు మహేష్‌బాబును నియమించనున్నారు. దీనికి సంబంధించి మహేష్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు మహేష్‌ను కలిసి ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. మహేష్‌ అంగీకరిస్తే త్వరలో ముఖ్యమంత్రితో ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. అవసరమైతే మహేష్‌ను కాంగ్రెస్‌పార్టీలోకి ఆహ్వానిస్తామని సిఎం మద్దతుదారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఏడాదిపాలన పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో విఫలయ్యారు. పార్టీపరంగా తెలంగాణా అంశంలోనూ, జగన్‌ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళ్ళకుండా అరికట్టడంలోనూ, అవిశ్వాస తీర్మానం వీగిపోవడంలో పంతం నెగ్గించుకున్నా పరిపాలనలో విజయవంతం కాలేదని కాంగ్రెస్‌పార్టీ నేతలే అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పథకాలు ప్రవేశపెట్టినా వాటిని ఏ ఒక్క మంత్రీ బయట చెప్పుకోవడం లేదు. కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధింత శాఖ మంత్రితో చెప్పకుండా ఏకపక్షంగా పెట్టిన పథకాలను ఎందుకు ప్రచారం చేయాలని సిఎంపై మంత్రులు మండిపడుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని పథకాలను నీరుగార్చుతూ తానొక్కడే గొప్ప అంటూ కొత్త పథకాలను తీసుకొస్తే తమకేం ఉపయోగమని మంత్రులు వాదిస్తున్నారు.

 

 

మంత్రుల సహకారం లేకపోయినా సిఎం కిరణ్‌ తన సొంత ఉపన్యాసాలతో లక్షల రూపాయలు ఖర్చు చేసి పత్రికలు, టివి ఛానల్‌లో ప్రకటనలు ఇచ్చుకున్నా ప్రజలను ఆకర్షించలేకపోయారు. కాంగ్రెస్‌లో చిరంజీవి వచ్చినా పథకాలను ప్రచారం చేయకుండా మరో గ్రూపుగా మారడంతో కిరణ్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఉపఎన్నికల్లో తన పథకాలతో ఒకరిద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుని అధిష్టానం వద్ద మెప్పుపొందాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోతే పదవికి ఎసరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిరణ్‌ వ్యతిరేకులు అంటున్నారు. దీంతో సినిమా నటుడు మహేష్‌ను అంబాసిడర్‌గా పెట్టుకుని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కిరణ్‌ చూస్తున్నారు. ఏ పార్టీలోనూ తాను చేరబోనని గతంలో మహేష్‌ ప్రకటించారు. తన కుమారుడు ఏ పార్టీ తరపునా ప్రచారం చేయబోరని ఆయన తండ్రి కృష్ణ కూడా చెప్పారు. కాంగ్రెస్‌పార్టీలో చేరకుండా పథకాల ప్రచారం కోసం మాత్రమే అంబాసిడర్‌గా ఉండాలని మహేష్‌ను సిఎం కోరుతున్నట్లు తెలిసింది. సిఎం విజ్ఞప్తిని మహేష్‌ వ్యతిరేకించలేదని తెలిసింది. ప్రభుత్వ సహకారం కూడా మహేష్‌కు అవసరం. పోకిరి సినిమా నాటి నుండి ఆయనపై ఆదాయపన్ను శాఖ దాడులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఖలేజా, దూకుడు సినిమాలు విడుదలైనప్పుడు కూడా ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఆ సమయంలోనే మహేష్‌ ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు తెలిసింది.

 

పథకాలను ప్రచారం చేయడానికి అంబాసిడర్‌గా ఉండాలని మహేష్‌ ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు అంతర్గతంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వంగానీ, మహేష్‌గానీ బయటకు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వర్గీయులు లీక్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంబాసిడర్‌గా మహేష్‌ను ఉపయోగించుకుంటూ చిరంజీవికి చెక్‌ పెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నట్లు తెలిసింది.

జగన్ రైతు దీక్ష గ్రాండ్ సెక్సేస్

 నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని రైతు దీక్ష గ్రాండ్ సెక్సేస్ అయ్యింది ..తెలంగాణా జిల్లాలో జగన్ కి జనం బ్రహ్మరధం పట్టారు ..ఇప్పటికే వేదిక వద్దకు ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ రైతులు ఈ సభకు వస్తున్నట్టు YSR కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు దీక్షా శిబిరం వద్ద పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

బాడీ గార్డ్ స్పెషల్ షో కి హిట్ టాక్

విక్టరీ వెంకటేష్ 'బాడీగార్డ్' చిత్రంతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ 'U'సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబందించిన స్పెషల్ షో ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శించారు. ఈ షోకి వెంకటేష్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్పెషల్ షో చూసిన వారి నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం వెంకటేష్ ఖాతాలో మరో విక్టరీ చేరడం ఖాయం అంటున్నారు. ఇది ఒక రకంగా అభిమానులకు ఆనందకర విషయమే.

ఈ చిత్రంలో వెంకటేష్ త్రిష బాడీగార్డుగా పని చేస్తుంటాడు. తొలి సగ భాగం సినిమా మొత్తం పూర్తి వినోదాత్మకంగా, వెంకటేష్ మార్కు కామెడీతో అభిమానులను గిలిగింతలు పెడుతుంది. కాలేజీ వాతావరణంలో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ లో కామెడీ పాళ్లు తగ్గి సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా క్లైమాక్స్ లో చివరి 30 నిమిషాలు వెంకటేష్ టెర్రిఫిక్ యాక్షన్ సీన్లు ఉంటాయి. రామ్ లక్ష్మణ్ అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద గోపీ చంద్ మలినేని తన మార్కును మరోసారి చాటుకున్నాడని అంటున్నారు. బెల్లకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

ఇప్పటికే బాడీగార్డ్ మలయాళం, హిందీ బాషల్లో నిర్మితం అయిన భారీ విజయం అందుకున్నాయి. వెంకటేష్ నటించిన తెలుగు వెర్షన్ కూడా సంక్రాంతి పండగకు కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అనే వార్తలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది

9, జనవరి 2012, సోమవారం

బాబు అరెస్ట్

విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనకు నిరసనగా తెలుగుదేశం నేతలు జరుపుతున్న పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు.విద్యుత్ సౌద వరకు వెళ్లనివ్వాలని టిడిపి నేతలు డిమాండ్ చేసినప్పట్టికీ పోలీసులు అంగీకరించలేదు. ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కలుగుతుందన్న భావనతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల చర్యకు నిరసనగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డుమీద భైటాయించారు. తాను విద్యుత్ సౌధ వరకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేసినా పోలీసులు అంగీకరించలేదు. ఆ తర్వాత వీరందరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కొంతసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. టిడిపి నేతలందరిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

టెక్నాలజీ కొత్త పుంతలు: చైనాలో తొలి 3డి ఛానెల్ ప్రారంభం

 టెక్నాలజీలో రోజురోజుకూ అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఆ తర్వాత కలర్ టీవీలు... అనంతరం ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలు, ఇలా టెక్నాలజీలో రోజురోజుకూ విస్తారమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో 3 డీ టీవీలు చేరాయి. ఈవారం చైనా 3 డీ టీవీలను ప్రారంభించింది. 

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం 2డీ నుంచి 3డీకు మారుతోంది. ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, అభిరుచుల్లో వస్తున్న మార్పులు వెరసి కొత్తదనానికి సై అనేలా చేస్తున్నాయి. టీవీల్లో అయితే పిక్చర్ క్వాలిటీ, డిజైన్ తోపాటు వినూత్న ఫీచర్లను కస్టమర్లు కోరుకుంటున్నారు.

చైనా రాజధాని బీజింగ్ లో తొలి 3 డైమన్షల్ ఛానెల్  ప్రారంభమైంది. అధికారికంగా ఈనెల చివర్లో వచ్చే లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ నుంచి ఛానెల్ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఛానెల్ ప్రసారాలు ఉంటాయి. తొలి దశలో వీక్షకులు ఎలాంటి ఫీజు చెల్లించనక్కరలేదు. డాక్యుమెంటరీలు, క్రీడలు, సీరియల్స్, లైవ్ ఈవెంట్స్ లాంటి కార్యక్రమాలు ఈ ఛానెల్ లో ప్రసారమవుతాయి.

3డీ అంటే త్రీ డైమన్షన్ అని అర్థం. టీవీ, సినిమా స్క్రీన్ పై కనిపించే సంఘటనలన్నీ మన ఎదురుగా జరుగుతున్నట్లు భ్రమ కల్పించేదే 3డీ టెక్నాలజీ. అంటే ఒక చిత్రాన్ని ఏవైపు నుంచి చూసినా దాని డెప్త్ కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ పాప చిత్రాన్ని చూడండి. ముందు ఈ చిత్రాన్ని 2డీలో చూద్దాం. ముందువైపు నుంచి బాగానే కనిపించినా... ఓ పక్కగా చూస్తే పేపర్ మాత్రమే కనిపిస్తుంది. ఇదే చిత్రాన్ని 3డీలో వీక్షిస్తే ఏవైపు నుంచి చూసినా పాప ముఖమే దర్శనమిస్తుంది.

ఒక దృశ్యాన్ని 3డీలో చూస్తే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అదేంటో తెలుసుకోవాలంటే మనం ఐమాక్స్ కు వెళ్లాల్సిందే. మామూలు థియేటర్లలో స్క్రీన్స్ తో పోలిస్తే... ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్ ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది. దీంతో సినిమాల్లోని సీన్స్  మన ఎదురుగానే జరుగుతున్నట్లు ప్రేక్షకులకు ఫీలింగ్ కలుగుతుంది. ఇక... ఐమాక్స్ లో నడిచే ఓ మూవీ టైటిల్స్ చూద్దాం. టైటిల్స్ మన మీదకే వస్తున్నట్లు కనిపిస్తోంది కదా. ఇదే 3డీ టెక్నాలజీ మహత్యం.

అసలు 3డీలో అంత రియాలిటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా?. మామూలు చిత్రాల్లో ఒక సీన్ ను అనేక కెమెరాలు ఉపయోగించి... అనేక యాంగిల్స్ లో చిత్రీకరిస్తారు. అయితే 3డీలో ప్రతి సీన్ ను రెండు కెమెరాలతో షూట్ చేస్తారు. వివరంగా చెప్పాలంటే ఏదైనా దృశ్యాన్ని మనం రెండు కళ్లతో చూస్తే కలిగే అనుభూతి ఒక్క కంటితో చూస్తే కలగదు. ఇదే ఫార్ములాను 3డీ కోసం ఉపయోగిస్తారు. మన కళ్ల మధ్య ఎంత దూరం ఉంటుందో... కెమెరాలను కూడా అంతే దూరంలో ఉంచి షూటింగ్  చేస్తారు. షూటింగ్ మొత్తాన్ని రెడ్, సియాన్ కలర్స్ లోనే షూట్ చేస్తారు.

ఇక 3డీ చిత్రాల షూటింగ్ కోసం ఉపయోగించే ఫిల్మ్... సాధారణ ఫిల్మ్  కంటే మూడు, నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుంది. అలాగే 3డీ చిత్రాల్ని మనం సాధారణంగా చూడకూడదు. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలను ఉపయోగించాలి. షూటింగ్ కు ఉపయోగించిన రెడ్, సియాన్ కలర్స్ తోనే ఈ కళ్లద్దాలను తయారు చేస్తారు.ప్రపంచం మొత్తం 3డీ వైపు చూస్తుండటంతో కంపెనీలు సైతం దానికి అనుగుణంగా టెక్నాలజీని అప్ డేట్ చేసుకుంటున్నాయి. 

 

ఒకప్పుడు వారిద్దరూ ఉప్పు నిప్పు: నేడు ప్రేమ ఒలకబోసుకుంటున్న ఉమ, వంశీలు

  ఒకప్పుడు వారిద్దరూ ఉప్పు నిప్పు.. ఒకరి పేరు మరొకరికి చెబితే భగ్గున మండిపడేవారు. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలేవి. ఇప్పుడు హఠాత్తుగా సీన్  రివర్స్  అయింది. ఒకరిపై మరొకరు ప్రేమ ఒలకబోసుకుంటున్నారు. నవ్వుకుంటూ జోకులేసుకుంటున్నారు. ఎవరా ఇద్దరు నేతలు... ఏమా కథ... వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూదవాల్సిందే...

    సరిగ్గా ఏడాది క్రితం.. టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటన.. ఈ పర్యటన కృష్ణా జిల్లా టీడీపీలో పెద్ద దుమారాన్నే రేపింది. పార్టీ రూరల్  అధ్యక్షుడు దేవినేని ఉమ.. పార్టీ అర్బన్  అధ్యక్షుడు వల్లభనేని వంశీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాటలు తూటాలు పేలాయి. హరికృష్ణకు దేవినేని ఉమ ఎలాంటి గౌరవం ఇవ్వలేదని, నందమూరి వంశీయులకి పార్టీలో ప్రాధాన్యం లేదంటూ వంశీ ఆరోపణలు గుప్పించారు. ఉమపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీకి రాజీనామా కూడా చేశారు

 

  దీనికి పోటీగా దేవినేని ఉమ కూడా రాజీనామా చేశారు. దీంతో పార్టీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ వివాదం నారా, నందమూరి కుటుంబాల మధ్య వార్ గా మారిందని అందరూ భావించారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండడంతో ఈ వివాదం ఎటు తిరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చంద్రబాబు టూర్ ముగించుకొని వచ్చాక ఉమ, వంశీలను పిలిచి క్లాస్  తీసుకున్నారు. ముఠా తగాదాలతో పార్టీని భ్రష్టు పట్టించవద్దని వార్నింగ్  ఇచ్చారు. దీంతో వారిద్దరూ రాజీ మార్గానికి వచ్చారు. రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.

 

 ఇరు వర్గాల మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినప్పటికీ... దేవినేని, వల్లభనేని కలిసి పని చేసిన సందర్భాలే ఎక్కడా కనిపించలేదు. కృష్ణా జిల్లాలో వారిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు సీన్  రివర్స్  అయింది. సోమవారం టీడీపీ పార్టీకార్యాలయంలో జరిగిన పాలిట్  బ్యూరో సమావేశంలో దేవినేని ఉమ, వల్లభనేని వంశీలు చెట్టాపట్టాలేసుకొని కనిపించారు.

ఇద్దరూ ఒకరితో మరొకరు నవ్వుతూ మాట్లాడడం, ఒకరి చెవుల్లో మరొకరు గుసగులాడడం కనిపించింది.  గత కొద్ది రోజులుగా పార్టీ సమావేశాలకు హాజరుకాని హరికృష్ణ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ హల్ చల్   చేశారు. దీంతో నేతలంతా హరికృష్ణతో మాట్లాడడానికి ఎగబడ్డారు. మొత్తానికి ఉప్పు నిప్పుగా ఉన్న ఉమ, వంశీలు ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

 

ఇవాళ ఆర్మూర్‌లో జగన్‌ రైతుదీక్ష

* అడ్డుకుంటామంటున్న జెఎసి

 * ఎమ్మెల్యే హరీష్‌ గృహ నిర్బంధం

 * దీక్షకు భారీ బందోబస్తు

 

 నిజామాబాద్‌ జిల్లాలో జగన్‌ పర్యటనకు సర్వం సిద్దమైంది. యువనేత రాక కోసం వైఎస్‌ఆర్‌సీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న జగన్‌ రైతు సమస్యలపై 48గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని జెఏసి హెచ్చరించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మరో పోరుబాటకు సిద్ధమయ్యారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో 48 గంటల పాటు రైతుల కోసం ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ శివారులో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో బారికేడ్లు నిర్మించి దీక్షా వేదిక ఏర్పాటు చేశారు. జగన్‌ పర్యటన సాగే మార్గంలో పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సుమారు 50వేల మంది దీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

 

 అటు పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న జగన్‌ తెలంగాణ వ్యతిరేకి అని TRS, టీజాక్‌ వాదిస్తోంది. TDP అధినేత చంద్రబాబు వరంగల్‌ పర్యటనను అడ్డుకున్నట్లే జగన్ దీక్షను కూడా అడ్డుకుంటామంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే జగన్‌ రైతు దీక్ష చేస్తున్నారని టీజాక్‌ ఛైర్మన్ కోదండరాం అన్నారు.

 

 టూర్‌కు నిరసనగా ఇవాళ ఆర్మూర్‌లో విద్యా సంస్థల బంద్‌కు జెఎసి పిలుపునిచ్చింది. తెలంగాణా ఇచ్చే శక్తి, అడ్డుకునే శక్తి తనకు లేదని పార్టీ ప్లీనరీ సమావేశాల వేదికపై జగన్‌ స్పష్టం చేశారని...వైఎస్‌ఆర్‌సీ నేతలు అంటున్నారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా జగన్ టూర్‌ను అడ్డుకోవాలనుకోవడం సబబు కాదని సూచిస్తున్నారు.

 

 మరోవైపు రైతు దీక్షను రాజకీయం చేయవద్దని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికలకు ఈ దీక్షకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటి చేయదని గతంలోనే స్పష్టం చేసామని ఆయన గుర్తుచేశారు.

 

 రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే దీక్ష చేస్తున్నామని అందరు సహకరించాలని ఆ లేఖలో కోరారు. ఇక.. జెఎసి హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావును ముందస్తుగా హౌజ్‌ అరెస్టు చేశారు. జగన్‌ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో ఆయనను గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. హరీష్‌ నిర్బంధంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

Ayn Rand Quotations in telugu

 

*తమని తాము గౌరవించుకోనివారిని   ఇతరులు కూడా గౌరవించారు.

*హేతుతత్వం మానవుని అదృష్టం. మానవుని అన్ని అదృష్టాలకు మూలం అదే.

*అపరాధము,భయము మానవుల మనస్సులను క్షోభకు గురి చేస్తాయి. సామాజిక సంసృతికి కూడా నష్టం కలిగిస్తాయి.

*మనిషికి ఆనందం భోగం కాదు. మానసిక అవసరం.

*చనిపొమ్మని మనుషులను ఆదేశించవచ్చుగాని ఆలోచించమని ఆదేశించలేము.

*ఆలోచనల్ని మరింత గొప్ప ఆలోచనలతో మాత్రమే ఎదుర్కోగలం.

*వృక్షం దాని ఆహారాన్ని భూమి నుండి పొందుతుంది.జంతువు వేటాడుతుంది, మానవుడు ఉత్పత్తి చేస్తాడు.

*సమాజ సంస్కృతి ఉత్పత్తి సాధనాలు ఉపయోగించడం మీద ఆధారపడి ఉంటుంది.

*తోటి  సోదరుల  మంచి కోసం కష్టించని  జీవితం మానవుడికి జీవితమే కాదు.

*వైవిధ్యమైన విలువలతో కూడిన మనిషి వ్యక్తిగత గుర్తింపును కోల్పోలేడు.

గొప్ప మానవుల్ని పరిపాలించలేం.

*మనసు ఉన్నతమైతే జ్ఞానము ఉన్నతమే. అతని ప్రణాళిక కూడా విస్తృతంగానే ఉంటుంది.

*నీతి సూత్రాలన్నీ నిజజీవిత సూత్రాలే, భౌతికశాస్త్ర సూత్రాలాంటివే.

*మనిషి జీవితపు నీతి తన స్వంత సంతోషం కోసమే.

*నైతిక సూత్రాలు మానవుని కార్యాచరణకు శక్తినిస్తాయి.

*మూర్ఖత్వం విషం , మృత్యువుదే  జయం. అలాగే మంచి చెడుల మధ్య సమన్వయంలో చెడే లాభం పొందుతుంది.

*బాధ,సహనాన్ని భరించడం స్వర్గం చేరడానికి అర్హతలు.

*ఉన్నత వర్గాలది నిన్న. రేపటి ప్రపంచం మధ్యతరగతిది.

*మానవుని మనసే అతని మనుగడకు మౌలిక కారణం. అంతే కాదు అది అతనికి స్వయంరక్షణ.

*వంశం పేదవాడికి పనికిరాని జంతువు.

*శాస్త్రం ఉపయోగకరం ఎందుకంటే అది విస్తృతి చెందుతోంది. బలపడుతోంది. మానవ జీవితాన్ని కాపాడుతోంది.

*ఏ సమాజ విధానాలు నీతి మీద ఆధారపడకపోతే ఎక్కువ కాలం మనజాలవు.  

Albert Einstein Quotations

*నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.

*ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.

*రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.

*సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.

*విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన  స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.

*మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.

*నా  జీవితాన్ని  వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను. కాని నా అంతరాలలోని 'నేను' అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.      

*జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే  తొక్కుతునే ఉండాలి.

*బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది.

*చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు. 

*తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.

*ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.

*జ్ఞానికన్నా ఊహ గొప్పది.

*నాకు గణితం మీద నమ్మకం లేదు.

*జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.

 *తెలివి,శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.

*స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.

*నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా  స్వీకరించాను.

భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.

*  ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని  మనిషి  ఆత్మలోని పాపాన్ని మాత్రం  మార్చలేము.

*ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం. అంతటి  లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.

*నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు.

*అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి  ఎక్కువ హానికరం,అగౌరవం.

  *శాస్త్ర  విజ్ఞానమంతా  ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.

*దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు.

 *గొప్ప  వ్యక్తులకు సాధారణ వ్యక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత సహజం.

*ప్రకృతికి దగ్గరగా ఉంటే ...జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి.

*చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు.

Yandamoori Veerendranath Telugu Quotations

సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.

పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.

ఎక్కడయితే  శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.

ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.

ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.

ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.

ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది  ఏ  ఐన్ స్టీను కనుక్కోలేదు.

ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు.

ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.

ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు  ఒకేలా వుండేది.

High-tech mobiles used in AIIMS paper leak

New Delhi: High-end mobile phones with powerful camera and bluetooth devices were the tools used by three young men to scan the AIIMS post graduate entrance exam paper and send it to an email id outside the exam hall. How did they manage to smuggle the devices in?

An apparent lack of frisking at the examination centre in Sector 28 Noida helped the three accused secret in their Sony Xperia and Nokia Lumia phones with camera, specific softwares and bluetooth device to scan the question papers.

Amit Punia, who did his MBBS from PGI Rohtak, Kapil Kumar, 27, MBA graduate from Jamia Milia university and Krishan Pratap, 27, MA in public administration from Jamia Milia university and an MBA from IMC Meerut were the three young men arrested along with two others for attempting to leak the question paper.

 

The blue tooth and the earphone were used to confirm whether the transmitted photographs were legible.

They had the bluetooth device stitched to their shirts and a minute earphone was given to one of the accused.

Punia, along with Kumar and Pratap, the latter two posing as medical students, entered the hall with their gadgets. As soon as the three got the question papers, they clicked pictures of the papers and sent it to an email id of Bhisham Singh, 27, who was operating a computer in a rented accommodation outside the hall.

Singh downloaded the question paper and took out printouts.

Mohit Choudhary, 23, who hails from Bulandshahr (Uttar Pradesh) was the gang leader.

As soon as he got the question paper he was to take it to some people to get it solved, and give the answers on phone to some candidates who were willing to pay a huge amount.

However, he was arrested before he could do so.

 

వేడెక్కిన సినీ ప్రముఖల రాజకీయ అరంగేట్రం

* కాంగ్రెస్‌లో కలిసి పోయిన చిరంజీవి

 * కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్న కృష్ణ ఫ్యామిలీ

 * టీడీపీకి ప్రచార సారధులుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్

 * ఈసారి పోటీ చేస్తానన్న బాలయ్య

 * వైఎస్‌తో కృష్ణకు సన్నిహిత సంబంధాలు

 * కృష్ణ కుటుంబానికి గల్లా అరుణకు బంధుత్వం

 * యూత్‌ను ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్

 * అప్పట్లో కాంగ్రెస్‌ ప్రచారానికి ప్రయత్నాలు

 * సున్నితంగా తిరస్కరించిన మహేష్

 * ఇప్పటికే జగన్‌కు మద్దతు పలికిన విజయనిర్మల, నరేష్

 * యువనేత జగన్‌కు అండగా మహేష్‌ ఉంటారని ప్రచారం

 * స్పందించని మహేష్ బాబు

 * సినీ ప్రపంచాన్ని వదలి రాజకీయాల్లోకి వస్తాడా

 * రాజకీయాల్లో రాణిస్తారంటున్న మహేష్‌ అభిమానులు

 

 యూత్‌ గ్లామర్‌ వున్న సినీ నటుడు మహేష్‌బాబును రంగంలోకి దించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు...సొంతపార్టీలోని చిరంజీవి, ప్రతిపక్ష పార్టీలోని బాలయ్యలకు పోటీగా మహేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఆయన యత్నిస్తున్నారు. ఈ మేరకు మంత్రి గల్లా అరుణకుమారికి కిరణ్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

 

 రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముంచుకొస్తుండడం... సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలే ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే సినీ గ్లామర్‌ కనిపిస్తోంది. ఇప్పటికే పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోగా గతంలో కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారుగా నిలిచిన సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయగా మరోసారి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తోంది.

 

 రెండు రోజులపాటు కృష్ణా జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో మూడు ప్రాంతాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇటు సొంత పార్టీలో చిరంజీవికి.. అటు ప్రతిపక్ష పార్టీలో బాలయ్యకు చెక్ పెట్టేందుకు సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభిమానిగా మొదటి నుంచి కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కృష్ణ 1989లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు.

 

 అటు తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నా ..రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మహేష్ బాబును కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి 2009 ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ముందుంది మంచి కాలం ఎందుకు అంత తొందర అన్ని రీతిలో కృష్ణ దంపతులు అప్పట్లో వైఎస్‌కు చెప్పినట్లు రాజకీయ వర్గాలు చెప్పాయి.

 

 టీడీపీ తరపున బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ప్రచారం చేసే అవకాశమే ఉండటమే కాక ఏకంగా బాలయ్య పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో కాంగ్రెస్‌లో కూడా యూత్ ఓటు బ్యాంక్ ను ఆకట్టుకునేందుకు మహేష్ బాబును రంగంలోకి దించాలని కిరణ్ కుమార్‌ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కృష్ణ కుటుంబానికి, కాంగ్రెస్‌లో సీనియర్ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబానికి బంధుత్వం ఉంటడంతో ఈ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.

 

 ఇప్పటికే విజయనిర్మల, నరేష్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. వైఎస్‌తో కృష్ణ కు సన్నిహిత సంబంధాలు వుండటంతో ఆయన కుటుంబం మద్దతు కూడా జగన్ వుంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు జోరుగాసాగుతున్న మహేష్ బాబు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం రాలేదు.

 

 ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహేష్ భవిష్యత్తులో రాజకీయాల్లో రాణిస్తారనే ఆశా భావం ఆయన అభిమాన సంఘాల ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సినీ రంగంలో మంచి భవిష్యత్తు వుండగా ఇప్పటికిప్పు డు ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపకపోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

2, జనవరి 2012, సోమవారం

Women should know how much skin they should cover: Karnataka minister

 Karnataka's women and child welfare minister C C Patil assumed tones of a moral policeman on Sunday saying, "I personally don't favour women wearing provocative clothes and always feel they need to be dignified in whatever they wear." He also said women should know how much skin they should cover. 

Patil was speaking to TOI on Andhra Pradesh director general of police Dinesh Reddy attributing the rise in rape cases to women dressing provocatively by wearing "flimsy and fashionable" dresses. Patil said incidents like rape and 
sexual harassment occur when moral values among men decline - the subtext being women dressing "provocatively" cause men's morals to nosedive. 

"Today's lifestyle makes it mandatory for women to work like men and live on equal terms with them. So women work in IT companies and call centres at night, they ought to know how much skin they should cover when they leave for such work places. Thus, I leave the issue of their dressing to them," said Patil. 

"I do not insist on a dress code for women because women belonging to various castes and communities dress according to their culture and tradition. Many women wear saris while others wear salwar. At the same time, there are western outfits like low-waist jeans also easily available in the market. But it's up to women to decide which dress is safe for them," he said. 

Perhaps apprehending he would be accused of being a misogynist, Patil hastily added, "Over the centuries, we have given respectful position and dignified status to women. We worship women in many ways. As a mark of respect to women, many rivers are named after them in the country which only indicates the respect we have towards women.'' 

Facebook Could Be Route to New Kidney

SEATTLE — Here's another reason for holdouts to join the social media site Facebook: It's a great place to find a kidney.

Between the kid photos and reminiscences about high school, more and more pleas for help from people with failing kidneys are popping up. Facebook and other social media sites are quickly becoming a go-to place to find a generous person with a kidney to spare, according to the people asking for help and some national organizations that facilitate matches.

Damon Brown found a kidney on Facebook after telling his story on a special page the Seattle dad created under the name, "Damon Kidney." His friends and family forwarded the link to everyone they knew and on Jan. 3 a woman his wife has known for years, but not someone they consider a close family friend, will be givi

ng him a kidney. "She said it wasn't really for me. It was for my kids, because they deserve to have a dad around," said Brown, 38.

Brown's story is not unique, said April Paschke, a spokeswoman for the United Network for Organ Sharing, a private nonprofit organization that manages the nation's organ transplant system for the federal government.

"We see more and more people matched up by social media," she said. "It's an extension of the way we communicate. Before we found the Internet, people found other ways: through a church bulletin, word of mouth or an advertisement even."

This past year, a man in Michigan also found a kidney donor through Facebook, and a Florida woman found one through Craigslist.

Damon Brown admits he was a little embarrassed to ask for help so publicly. Except for telling close friends and family, the Seattle father of two young boys had been keeping his illness pretty quiet.

He was on the official transplant list and had started mobile dialysis through Northwest Kidney Centers but Brown was seeing his health deteriorate — he was constantly tired and achy. He couldn't sit on the bed to tell bedtime stories to 5-year-old Julian and 3-year-old Theo because he had to stay close to his dialysis machine.

"I'm a strong guy, but I would have to say, it's been rough this year," he said. Brown had put himself on the long wait list for a kidney from a deceased donor, knowing he would have to wait at least three years before he was called.

After one particularly difficult visit with his doctor, Damon and his wife, Bethany, decided to create the Facebook page, which has attracted more than 1,400 friends.

A few weeks ago, after the transplant was approved and scheduled, Brown posted the good news to his Facebook friends. More than 300 people responded: "Whoo hoo....what a great Christmas present," wrote Kelly L. Hallissey. "This is awesome!! Praying for you and your family for positive news and a great way to begin 2012!" wrote Brenda Tomtan.

Many people are not aware that kidney and liver donations can now come from living donors.

In 2010, 16,800 kidney transplants were performed in the United States, of which 6,277 came from living donors, according to the United Network for Organ Sharing. An average of 46 kidney transplants take place each day in this country, while another 13 people who have been waiting for a kidney die each day. About 90,000 are on the transplant list right now.

Jacqueline Ryall, 45, said she felt a need to donate a kidney to Brown to give back her own good health and all she has been given. She's not a mom and gushed about how beautiful Damon and Bethany's kids are.

"The real reason I'm doing this is he's got kids and he's a good guy," she said. "My life is in a good place. I've been given lots and I have a responsibility to give back."

Ryall said her elderly mother does not understand why she would give a kidney to someone other than her own brother and sister, and her family is worried about her health going forward.

After her own research, however, Ryall decided it's relatively safe for a woman in good health to donate a kidney. If something is going to go wrong with her own kidneys, she has heard they usually fail in twos.

"Right now it feels like absolutely the right thing to do," she said, adding that she hopes her decision will help make other people less afraid to do the same thing.

News media coverage of his quest flooded his hospital with so many requests for information — from total strangers — that Brown said he was asked to pull back on his publicity efforts. Four people passed the initial screening and came in for tests. Now that he sees a happy ending coming for himself, Brown would like to do whatever he can to help others.

April Capone, the previous mayor of East Haven, Conn., knows what Brown means about the attraction of happy endings.

Two years ago, she was sitting in her office checking her Facebook feed, when a post from one of her constituents popped up saying he needed a kidney.

"At that moment, Carlos was at Mayo, testing to get on the transplant list," said Capone, 36. "He really didn't tell anyone he was sick. The doctor said, 'if you don't do it, no one is going to know'." So Carlos Sanchez pulled out his cell phone and posted the request and Capone responded immediately.

"I knew from the second I saw his post that I was going to be a donor," said Capone, who barely knew Sanchez at the time. Now they're as close as siblings, talk on the phone almost daily and meet for lunch regularly.

Capone said she had no personal reason for donating a kidney; she just want to save a life.

"It was the best thing I ever did with my life," she said. "I wish I had more; I would do it again."