29, నవంబర్ 2011, మంగళవారం

మహేష్ బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ వైయస్ జగన్...!?


ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. ‘బిజినెస్ మ్యాన్’ చిత్రం 12 జనవరి 2012 న భారీ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుక డిసెంబరు 23న హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వేడుకకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్ జగన్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని టాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. జగన్ ఈ వేడుకకు అటెండ్ అయితే అటు సిని వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం గా నిలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి