29, నవంబర్ 2011, మంగళవారం

ఫస్ట్ ODI లో టీం ఇండియా గెలుపు

ఫస్ట్ ODI లో ఇండియా గెలుపు సాదించింది .రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్ తో ఇండియా ను గెలిపించాడు .ఒకానక దశలో ఇండియా 50 పరుగులు కే 5 వికెట్లును కోల్పోఇయింది. అ దశలో ఫీల్డ్ లో కి వచ్చిన రోహిత్ ఇండియా గట్టెక్కించాడు.బౌలర్లు వెస్టిండీస్‌ను 211 పరుగులకే కట్టడి చేసినా భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 212 పరుగుల లక్ష్యంతో కటక్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచులో 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో భారత బ్యాటింగ్‌ను రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ గాడిలో పెట్టారు. వీరిద్దరు నింపాదిగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగారు. అయితే వీడి జోడీని విడగొట్టడంలో విజయం సాధించిన వెస్టిండీస్ మ్యాచును పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంది. రవీంద్ర జడేజా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ ఏడు పరుగులకు అవుటయ్యాడు. అంతా అయిపోయిందని అనుకున్న సమయంలో వినయ్ కుమార్ రోహిత్ శర్మకు తోడ్పాడు అందిస్తూ వచ్చాడు. వీరిద్దరు చాలా వరకు సింగిల్స్ తీస్తూ విజయంపై ఆశలు పెంచారు. విజయానికి 11 పరుగులు కావాల్సిన సమయంలో రోహిత్ శర్మ అవుట్ కావడంతో మ్యాచు మరోసారి వెస్టిండీస్‌కు అనుకూలంగా మారింది. 201 పరుగుల వద్ద 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ అవుటయ్యాడు. దాంతో ఒత్తిడికి గురైన వినయ్ కుమార్ (18) 201 పరుగుల వద్దనే అవుటయ్యాడు.

201 పరుగుల వద్ద తొమ్మిది వికెట్లు కోల్పోయిన స్థితిలో బంతులు తరుగుతూ లక్ష్యం పెరుగుతూ వచ్చింది. 15 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. 11 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో పది బంతుల్లో నాలుగు పరుగులు చేస్తే సరిపోతుంది. ఒక్క వికెట్ మాత్రమే చేతిలో ఉంది. ఆ తర్వాతి బంతికి మరో పరుగు వచ్చింది. 3 పరుగులు చేస్తే విజయం అంది వస్తుంది. ఆ స్థితిలో ఉమేష్ యాదవ్ బంతిని బౌండరీ దాటించి భారత్‌కు విజయం సాధించి పెట్టాడు. చివరి జోడీగా ఉమేష్ యాదవ్, అరోన్ చెరో ఆరు పరుగులు చేశారు. దీంతో భారత్ తొలి వన్డే మ్యాచులో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగా భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో ఉత్కంఠభరిత మ్యాచుకు భారత బౌలర్లు బ్యాట్ ద్వారా ముగింపు ఇచ్చారు. వెస్టిండీస్ బౌలర్లు రోచ్, రస్సెల్ భారత బ్యాటింగును తుత్తునియలు చేసే పనికి పనికి పూనుకున్నారు. వారి ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రోచ్ మూడు వికెట్లు, రస్సెల్ రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.

అంతకు ముందు - వెస్టిండీస్‌పై భారత బౌలర్లు ఇరగదీశారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత కాస్తా నిలకడగా ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను వెస్టిండీస్ వికెట్లను కోల్పోతూ వచ్చింది. బ్రేవో మాత్రమే దాటిగా ఆడాడు. అతను 74 బందుల్లో 60 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు పిండుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్, ఆరోన్‌లు రెండేసి వికెట్లు తీసుకోగా, వినయ్ కుమార్, ఆశ్విన్, జడేజా, రైనా ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. భారత్ విజయం సాధించడానికి 212 పరుగులు చేయాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి