కురుక్షేత్ర సమరంలో ఎదురు పక్షంలో ఉన్న బంధుమిత్ర పరివారాన్ని చూసి బెంగటిల్లి ఆయుధాన్ని విసర్జించడానికి సిద్ధపడిన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు హితబోధ చేస్తాడు. యుద్ధంలో తరతమ భేదాలు కూడవని చెప్పి అర్డునుడిని సమరానికి సన్నద్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడి బోధలను మనసావాచా కర్మణా నమ్మిన రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనిపిస్తారు. మామ ఎన్టీ రామారావును గద్దె దించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడ లేదు. యుద్ధంలో గెలిచిన తర్వాత తన వెంట ఉన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును, బావమరిది నందమూరి హరికృష్ణను పక్కకు నెట్టేశారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పార్టీలన్నీ తిరిగి దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసులో స్థిరపడిపోగా, ఎంతైనా బావ కదా అంటూ తెలుగుదేశంలోకి వచ్చిన హరికృష్ణకు చంద్రబాబు తన రాజకీయాన్ని చవి చూపిస్తున్నారు.
బెజవాడ రాజకీయ వేడిలో దూకుడుగా వ్యవహరించి చంద్రబాబుకు హరికృష్ణ సవాల్ విసిరారు. తనకు తోడుగా పార్టీ నాయకులు వల్లభనేని వంశీకృష్ణ, కొడాలి నాని ఉన్నారని అనుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమామహేశ్వర రావుపై వారి చేత తిరుగుబాటు చేయించారు. కాస్తా రాజకీయం రంజుగా సాగుతుండగానే చంద్రబాబు తన చాణక్యనీతిని ప్రదర్శించి, సీన్‌ను తిరిగేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెనక్కి తగ్గి, చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గారు. అయితే, ఆ తర్వాతనైనా హరికృష్ణ పరిస్థితి చక్కబడిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. దాదాపుగా హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లే కనిపిస్తోంది.
హరికృష్ణ ఆది, సోమవారాల్లో విజయవాడలో ఉన్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన విజయవాడలో ఉన్నారు. ఆయనను తెలుగుదేశం నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దేవినేని ఉమా మహేశ్వర రావు సరేసరి, తనకు అత్యంత ఆప్తులని భావించిన వల్లభనేని వంశీ, కొడాలి నానీల అడ్రస్ కూడా లేకుండా పోయింది. గతంలో కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన హరికృష్ణను పట్టించుకోలేదనే నెపంతోనే వంశీ, కొడాలి నానీ ఉమామహేశ్వరరావుపై సమరానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు సమరానికి సమాయత్తం కావడం మాట అటుంచి, వారే హరికృష్ణ పక్కన నిలబడలేని స్థితి వచ్చేసింది. దీంతో హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేశారని అనుకుంటున్నారు. మళ్లీ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా హరికృష్ణ విజృంభిస్తాడా, చూడాల్సిందే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి