17, డిసెంబర్ 2011, శనివారం

23న రైతు సదస్సులు: వైఎస్ఆర్ కాంగ్రెస్ సిజిసి

ఈ నెల 23న జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లోటస్‑పాండ్‑లో జరిగిన ఆ పార్టీ కేంద్ర పాలక మండలి(సిజిసి) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

 

 ప్రభుత్వం కళ్లు తెరిచేలా రైతు సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు.విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‑మెంట్‑పై వచ్చే నెల 4వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఒంగోలులో జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాల్గొంటారు.స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని అంబటి తెలిపారు. 108,104 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి