16, డిసెంబర్ 2011, శుక్రవారం

భిన్నమైన గెటప్పులతో త్రీ రాస్కెల్స్‌

 

 

 

 

హిందీలో ఘన విజయం సాధించిన 'త్రీ ఇడియట్స్‌' చిత్రాన్ని తమిళ దర్శకుడు శంకర్‌ తమిళంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విజరు, జీవా, శ్రీకాంత్‌ హీరోలుగా, ఇలియానా కథానాయికగా నటిస్తోంది. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. 'త్రీ రాస్కెల్స్‌' పేరిట తెలుగులోకి డబ్‌ చేయనున్నారు. శంకర్‌ తనదైన స్టైల్లో సినిమాను తీర్చిదిద్దాడట. సహజంగానే శంకర్‌ ఓ ఆనవాయితీ పాటిస్తుంటాడు. అదేంటంటే...వివిధ గెటప్స్‌తో హీరో హీరోయిన్లను చూపటం. జెంటెల్‌మన్‌ నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. తాజా చిత్రం 'త్రీ రాస్కెల్స్‌'లో కూడా హీరో విజరుతో వివిధ గెటప్స్‌ వేయించాడు. అలాగే ఆడియో ఫంక్షన్‌కు కూడా భారీ ఏర్పాట్లు చేశాడు.

 

సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ కోయంబత్తూర్‌లోని హిందుస్తాన్‌ కాలేజీలో 'ఆన్‌ ద ఎడ్జ్‌' అనే మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆడియో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ వేడుకకు ముంబై నుంచి బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడని టాక్‌ ! కాగా ఇందులో ఆరు పాటలున్నాయి. ఒక పాటలో 16 భాషలకు చెందిన వాడక పదాలను చేర్చారట ! అదీ సంగతి !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి