ఇదొక అసాధారణ ఘటనగానే చెప్పుకోవచ్చు. మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ కు మంజూరు అయిన బెయిల్ ను మళ్లీ వెంటనే సిబిఐ కోర్టు స్టే ఇవ్వడం విశేషం. సాధారణంగా ఒకసారి బెయిల్ మంజూరు అయితే పై కోర్టు లు స్టే ఇస్తుంటాయి. కాని సిబిఐ కోర్టు తాను మంజూరు చేసిన స్టేని వెనక్కి తీసుకోవడం విశేషం. ముందుగా రాజగోపాల్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది. దీనిపై సిబిఐ మరో పిటిషన్ వేసి బెయిల్ ను నిలిపి వేయాలని కోరింది. సాక్షులను రాజగోపాల్ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, హైకోర్టుకు వెళ్లడానికి వీలుగా నాలుగు రోజుల పాటు బెయిల్ పై స్టే ఇవ్వాలని సిబిఐ కోరింది. ఆ మీదట సిబిఐ కోర్టు దీనికి అంగీకరించి బెయిల్ ను ఈ నెల పొందొమ్మిది తేదీ వరకు నిలిపి వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇది అసాధారణ నిర్ణయంగానే భావిస్తున్నారు.
15, డిసెంబర్ 2011, గురువారం
రాజగోపాల్ బెయిల్ మంజూరు , మళ్లీ రద్దు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి