వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తే తాము అడ్డుకోబోమని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం చెప్పారు. రాజ్యాంగపరంగా పార్టీలకు ఇచ్చిన హక్కులను అడ్డగించడం మా ఉద్దేశ్యం కాదన్నారు. రెండేళ్లుగా రాజయ్య తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, కొండా సురేఖ కూడా తన నియోజకవర్గంపై దష్టి సారించలేదని విమర్శించారు. వచ్చే ఉప ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలలోనూ టిడిపి అఖండ విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులను ఖరారు చేశామన్నారు.
మద్యం సిండికేట్లలో ఏ పార్టీ వారు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేనని మరో నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ వేరుగా అన్నారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు కూడా అందుకు మినహాయింపు లేరన్నారు. బెల్టు షాపులు తక్షణం మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బెల్టు షాపులను వెంటనే మూసి వేయీంచాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనే ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మద్యాన్ని రిటైల్‌లో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం షాపుల ద్వారా ఎమ్మార్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించాలన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి