16, డిసెంబర్ 2011, శుక్రవారం

సత్తా చాటుతున్న సత్తిబాబు

 పార్టీలో కీలక నిర్ణయా లపై ిపీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తన సత్తా చాటుతున్నారు. రాష్ట్ర పార్టీలో తనదైన ముద్రకోసం పావులు కదుపుతున్నారు. విప్‌ను దిక్కరించిన సొంత పార్టీ ఎమ్మెల్యే లపై వేటు వ్యవహారంలో బొత్స విజయం సాధించారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారందరిపై చర్యలు తీసుకొనేందుకు వీలుగా అధిష్ఠానం వద్ద ఆయన చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. విప్‌ను దిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటుకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అంతగా ఆసక్తి చూపడంలేదన్న ప్రచారం నేపథ్యంలో వేటు పడాల్సిందేనంటూ బొత్స తొలి నుంచి పేర్కొంటున్న విషయం తెలిసిందే.

 

ఈ విషయంలో బొత్స, కిరణ్‌ల మధ్య విభేదాలున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. విప్‌ను దిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయడం ద్వారా తన సత్తాచాట్టాలని బొత్స సత్యనారాయణ యత్నస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు అధిష్ఠానంను బొత్స ఒప్పించగలిగారు. అంతేకాకుండా జగన్‌ మద్దతు దారులుగా ఉన్న ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డిలపై వేటుకు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

 

దట్‌ ఈజ్‌ బొత్స...?:

 ిపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కొంత ఉత్సాహం ప్రదర్శించిన బొత్స సత్యనారాయణ ఆ తరువాత కొంత దూకుడును తగ్గిం చారు. కొందరి ఫిర్యాదుల మేరకు ఢిల్లీ పెద్దలు బొత్సను నియంత్రించారన్న ప్రచారం నాడు సాగింది. అయితే సర్కార్‌పై అవిశ్వాసం అంశం బొత్సకు బాగా కలిసొచ్చింది. సర్కార్‌కు మద్దతుపై పీఆర్‌ిపీ అలకపాన్పుఎక్కడంతో వారిని దారిలోకి తచ్చేందుకు బొత్స ప్రయత్నించి విజయం సాధించారు.

 

ఆ తరువాత అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వై.ఎస్‌.విజయమ్మ, ప్రధాన ప్రతి పక్షనేత చంద్రబాబు విమర్శలపై ధీటుగా స్పందిస్తూ ప్రభుత్వం వైపునుంచి బొత్స కీలక పాత్ర పోషించారు. అనంతరం విప్‌ను దిక్కరించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న సంకల్పంతో బొత్స ముందుకు సాగారు. వేటు నేపథ్యంలో వచ్చే ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ిసీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకు మొగ్గుచూపడంలేదని ప్రచారం సాగింది. కానీ వేటువేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారానే పార్టీ బలాన్ని చాట్టాలని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గట్టి అభిప్రాయంతో ముందుకెళ్లారు. ఈ వేటు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో బొత్స విజయం సాధించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విప్‌ను దిక్కరించిన ఎమ్మెల్యేలతోపాటు జగన్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్సీలు ఎస్వీ మోహన్‌రెడ్డి, కొండా మురళీ, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్‌పై కూడా చర్యలు తీసుకొనేందుకు వీలుగా అధిష్ఠానం అనుమతిని బొత్స పొందినట్లు సమాచారం.

 

ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్సీలపై వేటుకు త్వరలోనే శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణికి కాంగ్రెస్‌నాయకత్వం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, సబ్బం హరిపై కూడా చర్యలుతీసుకోవాలని పార్టీ అధినా యక త్వానికి బొత్స ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారిపై కూడా చర్యలు ఉంటాయని బొత్స ఢిల్లీలో మీడియాతో కూడా పేర్కొన్నారు. వేటు విషయంలో అంత ఆసక్తి సీఎం చూపకపోయినా, వేటు వేయడం ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ బలోపేతం అవడంతోపాటు జగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసినట్లవు తుందని పార్టీ అధిష్ఠానంను బొత్స తన వివరణతో మెప్పించగలిగారని పార్టీ వర్గాలు పేర్కొం టున్నాయి.

 

కనీసం కొన్ని స్థానాలు కాంగ్రెస్‌ ఉప ఎన్ని కల్లో గెలుచుకొన్న అది పార్టీ కి ప్లస్‌ అని బొత్స అధి ష్ఠానానికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. జగన్‌కు ఎమ్మె ల్యేల మద్దతు తగ్గిందని, ఆయన్ని మరింత బలహీనపర్చేందుకు ఉప ఎన్నికలే సరైన బాణం అని బొత్స భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠా నం దృష్టికితీసుకెళ్లారు. ఈ విషయంలో పార్టీ అధి ష్ఠానం మద్దతు పొంది బొత్స తన సత్తా చాటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో కీలక నిర్ణయాలలో అధి ష్ఠానాన్ని ఒప్పించడం ద్వారా క్రమంగా పార్టీపై బొ త్స పట్టు సాధిస్తున్నారని కాం గ్రెస్‌ శ్రేణులు పేర్కొం టున్నాయి.

 

కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఇప్పించే విషయంలో అధిష్ఠానాన్ని బొత్స ఒప్పించగలిగారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో చిరంజీవికి స్థా నం దక్కుతుందన్న ప్రచారం వేడెక్కింది. అవిశ్వాస ఓటింగ్‌లో పీఆరపీ మద్దతు సాధించడం, తరువాత కాంగ్రెస్‌లో వారికి సుముచిత స్థానంకల్పించడం ద్వారా ఆ నేతల మద్దతు పూర్తిస్థాయిలో బొత్స పొందగలిగారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మున్ముందు ఇది పార్టీపై పట్టుకొసం బొత్సకు ఎంతగానో దోహ దపడుతుందని చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి