* పార్టీకి నేతలు ప్రధానం కాదంటున్న బాబు
* కార్యకర్తలుంటే చాలంటున్న చంద్రబాబు
* క్యాడర్‌కు దగ్గరయ్యేందుకు బాబు ప్లాన్
* నేతలకు గుబులు పుట్టిస్తోన్న బాబు స్లోగన్ గ్రౌండ్
రియాల్టీ చంద్రబాబుకు బాగా బోధపడింది. నేతల్ని నమ్ముకుంటే పార్టీ నట్టేట మునుగుతుందని గ్రహించారు. పార్టీని ఇంతకాలం క్యాడరే నడుపుకొచ్చిందని విశ్వసిస్తున్నారు. నేతల కంటే కార్యకర్తలే ముఖ్యమని బాబు అందుకున్న తాజా స్లోగన్ సీనియర్లలో గుబులు పుట్టిస్తోంది. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు అధిష్టానంపై అపనమ్మకం ఉంది. కీలక నేతలకు మినహా ఎవరికీ బాబు వద్ద విలువలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బ్యూరోక్రాట్లు, కొందరు మంత్రులకు మినహా ఆయన క్యాడర్‌కు దూరంగా ఉన్నారు. అధికారం కోల్పోయిన తరువాత పార్టీ పలుమార్లు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది.
ఆ సమయాల్లో పార్టీకి అండగా నిలవాల్సిన అనేక మంది సీనియర్ లీడర్లు రాజీనామా చేసి వేరే పార్టీలకు వెళ్లిపోయారు. కార్యకర్తలు మాత్రం ఎదురీదారు. ఆ అనుభవాల్ని మననం చేసుకుంటున్న చంద్రబాబు లీడర్ల కంటే క్యాడరే తనకు ముఖ్యమని ఇప్పుడు పదేపదే చెబుతున్నారు. తాజా స్లోగన్‌తో క్యాడర్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. భవిష్యతులో వచ్చే ఎన్నికలకు వారిని సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల్ని అవకాశం చిక్కినప్పుడల్లా డామేజ్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయానికి రూట్ క్లియర్ చేస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీల భవిష్యత్ గురించి చెబుతున్న బాబు, తాజాగా నేతల కంటే కార్యకర్తలు మిన్నంటూ అందుకున్న స్లోగన్ పార్టీలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గుమ్మడికాయ దొంగవెరంటే భుజాలు తడుముకున్నట్టు...పార్టీని వీడి మళ్లీ సొంతగూటికి చేరిన వాళ్లకు చంద్రబాబు మాటలు ఇబ్బందిగా మారాయి. వాళ్ల ఇబ్బంది ఎలా ఉన్నా...బాబు దగ్గరవుతామని క్యాడర్ ఆశపడుతోంది. నిజంగా ఆయన చేరువవుతారా? లేక మాటలకే పరిమితమో చూడాలి.
telugu latest news today
రిప్లయితొలగించండి