కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తూ తనే స్వయంగా నిర్మిస్తున్న 'రాజన్న' చిత్ర కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నాగ్ స్వయంగా ఈ చిత్ర కథని చెప్పారు. నాగార్జున గారు చెప్పిన ఈ చిత్ర కథ మీ కోసం ప్రత్యేకంగా మల్లమ్మ అనే పాప రాజన్న కూతురు. తను పుట్టగానే తన తల్లి తండ్రులను కోల్పోతుంది. ఆదిలాబాద్ జిల్లా లోని నేలకొండపల్లిలో ఒక ముసలాయన దగ్గర పెరుగుతుంది. తన అందమైన పాటలతో గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తను రాజన్న కూతురు అన్న విషయం తనకి మరియు ఆ గ్రామంలో ఎవరికీ కూడా తెలియదు, తనని పెంచిన ముసలాయనకి తప్ప. ఆ గ్రామలో ఉండే దొరసాని కూతురికి సరిగా పాటలు పాడటం రాదు. తన కూతురికి పాడటం రాదు కాబట్టి మరెవ్వరు పాడకూడదు అని శాసిస్తుంది. ఒకవేళ మల్లమ్మ పాట పాడితే చంపేస్తానని బెదిరిస్తుంది. ఒకానొక సమయంలో మల్లమ్మ అనుకోకుండా పాట పాడుతుంది. దొరసాని తనని చంపేస్తుంది అని ఊరు విడిచి పారిపోతుంది. తన గ్రామలో ఉన్న సమస్యలు దొరల ఆదిపత్యం గురించి పండిట్ జవహర్లాల్ నెహ్రు గారికి చెప్తే ఆ సమస్యలు తీరిపోతాయని కొందరు చెప్పడంతో కాలినడకన ఆదిలాబాద్ నుండి డిల్లికి బయలుదేరుతుంది. కొందరు వ్యక్తుల సహాయంతో నెహ్రు గారు ఒక పాటల పోటీకి వస్తున్నారు అని తెలుసుకుని అక్కడికి వెళుతుంది. మల్లమ్మ అక్కడ ఉన్న విషయం దొరసాని తెలుసుకుని మల్లమ్మని నెహ్రు ని కలవకుండా చేయాలని తన మనుషులతో డిల్లి బయలుదేరుతుంది. ఇంకా దొరసాని తనని చంపేస్తుందని ఆశలు వదిలేసుకున్న సమయంలో తనకి రాజన్న కథ తెలుస్తుంది.
రాజన్న స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారితో పోరాడిన యోధుడు. స్వాతంత్రం వచ్చిన తరువాత తన గ్రామానికి వస్తాడు. అక్కడ రజకారుల వాళ్ళ తన గ్రామస్తులు పడుతున్న భాధలు చూసి వారిలో చైతన్యం రగిలిస్తాడు. రజకారుల నుండి తన గ్రామానికి విముక్తి కలిగేలా చేస్తాడు. తరువాత మల్లమ్మ తన సమస్యల నుండి బయట పడింది మిగతా చిత్ర కథ.
ఇది రాజన్న చిత్ర కథ. నాగార్జున గారు ఈ చిత్రంలో అతిధి పాత్రా పోషించడం లేదు. ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి