18, డిసెంబర్ 2011, ఆదివారం

చిరుకు రాజ్యసభ?

 పార్టీలో చిరంజీవికి సముచిత స్థానం ఎప్పుడు అన్న ఉత్కంఠకు మార్చిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తెరదించనున్నది. మార్చిలో చిరంజీవికి రాజ్యసభ సీటు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అప్పుడే కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని భావస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోనూ ఆయన వర్గానికి మంత్రిమండలిలో చోటు ఇవ్వాలి అని కాంగ్రెస్‌ అధిష్ఠానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించినట్లవుతందని కాంగ్రెస్‌ నాయకత్వం యోచిస్తోంది. కేంద్రమంత్రివర్గంలోకి తీసుకొంటూనే రాష్ట్రంలోనూ చిరు సేవలు ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

కలిసొచ్చే సమయం కోసం...?
పీఆర్పీ విలీనం తరువాత చిరంజీవికి కీలక బాధ్యతల అప్పగింతపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆచితూచి అడుగులేస్తోంది. చిరంజీవికి ఒక్క సారిగా కాంగ్రెస్‌ అందలం ఎక్కించిందన్న భావన కలగకుండా, ఆ యన్ను పూర్తిగా విస్మరిస్తోందన్న అపవాదు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నాయకత్వం సమయం కోసం వేచిచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చిలో చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా కేంద్రంలో చోటు కల్పించాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. చిరుకు తొలుత మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత రాజ్యసభలో స్థానం కల్పించడానికి ఆస్కా రమున్నా అదే చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ నాయకత్వం ఆదిశగా నిర్ణయం తీసుకొలేదని తెలిసింది. 

మార్చిలో రాజ్యసభసీట్లు ఖాళీ అవుతున్నందున ఆయనకు ఆ ఖాళీలో చోటు కల్పించాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. రాజ్యసభసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక, కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని యోచిస్తుంది. ఇదిలావుంటే రాష్ట్ర కేబినేట్‌లోనూ చిరు వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఈ మేరకు పార్టీ అధిష్ఠానం సంకేతం ఇచ్చినట్లు సమాచారం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న కినుకుతో ఉన్న చిరం జీకి ఢిల్లీనుంచి వచ్చిన బొత్స ఆయనతో సమావేశమై అధిష్ఠానం నిర ్ణయాన్ని తెలియజేసినట్లు తెలిసింది. 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి