19, డిసెంబర్ 2011, సోమవారం

గ్రూప్ ఒన్ పరీక్ష ఫలితాలు ఎపిపిఎస్సి వివరణ

గ్రూప్ ఒన్ పరీక్ష ఫలితాలకు సంబంధించి వచ్చిన వార్తలపై ఎపిపిఎస్సి వివరణ ఇచ్చింది. ఎపిపిఎస్సి ఇచ్చిన లెక్కలు చూస్తే ఒక పత్రికలో వచ్చిన కదనం అంతా అవాస్తవం అన్న అభిప్రాయం కలుగుతుంది. హైదరాబాద్ల 3184కి గాను 259 మంది , విశాఖలో 886 కి గాను 62 మంది ఎంపిక అయ్యారు, తిరుపతిలో 667మందికిగాను 33 మంది వరంగల్ లో ఇరవై రెండు మంది, విజయవాడలో నలబై మంది ఎంపికయ్యారని ఎపిపిఎస్సి ఛైర్ పర్సన్ రాచెల్ ఛటర్జీ ప్రకటించారు. కాని పత్రికలో వచ్చిన కదనం ప్రకారం ఒక్క తిరుపతిలోనే నూటపదిమంది రాత పరీక్షలలో ఎంపికయ్యారు. ఇదంతా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమేనని ఆరోపణలు చేస్తూ రాజకీయ నాయకులు ముఖ్యంగా టిఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీనిలో తెలంగాణ కోణం కూడా తీసుకు వచ్చారు. కాని ఎపిపిఎస్సి ఇచ్చిన లెక్కలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.ఇలాంటి సున్నితమైన అంశాలలో మీడియా కూడా సంయమనంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి