మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీల జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్రికా ప్రకనటల కోసం రూ.7.25 కోట్లు ఖర్చు చేసింది. రాజీవ్ గాంధీ జయంతి ప్రకటనలకు 4.79 కోట్లు ఖర్చు చేయగా, ఇందిరా గాంధీ జయంతి ప్రకటనలకు 2.46 కోట్లు ఖర్చు చేసింది. రాజ్యసభలో సోమవారం ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి సిఎం జతువా ఈ వివరాలు వెల్లడించారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదని, ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మాత్రం రూ.4.79 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యధికంగా రూ.95 లక్షలను ప్రకటనల కోసం ఖర్చు చేసింది. తర్వాతి స్థానాల్లో సంద్రాయేతర ఇంధన వనరుల శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖలున్నాయి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రూ.60 లక్షలు, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రూ.56 లక్షలు ఖర్చు చేసి అత్యధికంగా ఖర్చు చేసిన శాఖల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
19, డిసెంబర్ 2011, సోమవారం
రాజీవ్, ఇందిరపై ప్రకటనలు 7.25 కోట్లు ఖర్చు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి