* సివిల్స్, గ్రూప్స్ పోటీ పరీక్షలకు శిక్షణ
* అధికారుల నిర్లక్ష్యం... నీరుగారుతున్న విజయలక్ష్యం
* ఏపీ స్టడీ సర్కిల్‌పై సర్కార్ సవతి ప్రేమ
* మూసివేత దిశగా ఎపీ స్టడీ సర్కిల్....?
* ఇప్పటికే నగరంలోని ఆంబేద్కర్ భవన్‌లో శిక్షణ మూసివేత..!
* నిధుల కోరతే ప్రధాన కారణమట..!
* విస్మయానికి గురి చేస్తున్న సర్కార్ తీరు
* 2010 సివిల్స్‌కు ఎంపికైనా మాక్ ఇంటర్వ్యూల మాటే లేదు..!
* 3.5కోట్లతో సర్కార్‌కు ప్రతిపాదనలు పంపిన సాంఘిక సంక్షేమ శాఖ
* అరకోరగా నిధుల విడుదులు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం
లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకునే సర్కార్...ఏపీ స్టడీ సర్కిల్‌పై మాత్రం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. రాష్ట్రం నుంచి ఎంతో మంది ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌లను అందించిన ఏపీ స్టడీ సర్కిల్ మూసివేయడానికి రంగం సిద్దమైంది. విజయవాడ, వైజాగ్, వరంగల్ కేంద్రాల్లో ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే నిలిచిపోగా.... తాజాగా సర్కార్ విడుదల చేసిన నిధులను చూస్తే రాజధాని బ్రాంచ్ పరిస్థితీ అంతేనని అర్థమవుతోంది. పేద మధ్యతరగతి తరగతుల వారికి సివిల్స్, గ్రూప్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఆరంభమైందే ఏపీ స్టడీ సర్కిల్. హైదరాబాద్‌తో పాటు కడప, వరంగల్, వైజాగ్, విజయవాడ కేంద్రాలలో సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వం ఏపీ స్టడీ సర్కిల్‌ను ఎర్పాటు చేసింది.
దాదాపు 400మంది అధికారుల్ని అందించిన ఘనత ఏపీ స్టడీ సర్కిల్ సొంతం. నాలుగేళ్ల పాటు నిరాటంకంగా శిక్షణను అందించింది. నగరంలో బంజారాహిల్స్‌తో పాటు లోయర్ ట్యాంక్ బండ్ ఆంబేద్కర్ భవన్‌లో శిక్షణ కేంద్రాలున్నాయి. ఆంబేద్కర్ భవన్‌లో ఇప్పటికే శిక్షణను మూసివేయగా... సర్కార్ పుణ్యామాని మొత్తం ఏపీ స్టడీ సర్కిలే మూతపడే దశకు చేరుకుంది. నిధులను విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2007నుంచే ఏపీ స్టడీ సర్కిల్ తీవ్రమైన సంక్షోభంలో పడింది. దీంతో పలువురు సంఘాల నేతలు సర్కార్ తీరుపై ధ్వజమెత్తుతున్నారు.
2010 సివిల్స్‌లో సర్కిల్ నుంచి ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వారికి మాక్ ఇంటర్వ్యూస్ నిర్వహించకుండా చేతులేత్తేసిందంటే ఎపీ స్టడీ సర్కిల్ ఎంత ఆధ్వాన్న స్థితిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడలో శిక్షణా కేంద్రాలు నిర్వహించాలంటే దాదాపు 3.5కోట్లు ఖర్చవుతుంది. సివిల్స్ శిక్షణ కోసం 200మంది ఆభ్యర్థులను ఎంపిక చేసినా... గెస్ట్ లెక్షరర్స్‌కు జీతాలివ్వకపోవడంతో ఎవ్వరూ సర్కిల్‌వైపు కన్నెత్తి చూడటం లేదు. ఉన్న స్టాఫ్‌ను సరిగా వినియోగించుకోవడం లేదన్నది సర్కిల్‌కు వెళితే వినపడుతోంది. ఇక మహిళా ఆభ్యర్థుల కోసం బంజారాహిల్స్‌లో సర్కార్ స్థలం కేటాయించినా భవనం నిర్మించే దిక్కే లేదు.
వరంగల్, విశాఖ, వైజాగ్‌లలో మూతపడిన కేంద్రాలను పున:ప్రారంభించాలంటే 39కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేదు. ఇది నిరుద్యోగులపై మన సర్కారుకు ఉన్న ప్రేమ. ఇప్పటికైనా సర్కార్ తీరు మార్చుకోకపోతే ఉన్నత కొలువులు, చదువులు పేద.. మధ్యతరగతి వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదముంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి