19, డిసెంబర్ 2011, సోమవారం

కిరణ్ చేతికి అస్త్రం?

మద్యం సిండికేట్ల వ్యవహారం కాంగ్రెస్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యంగా మద్యం సిండికేట్లపై చర్యలు తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. రోజురోజుకు మద్యం సిండికేట్లలో ఉన్న ప్రజాప్రతినిధుల జాబితా పెరుగుతున్న నేపధ్యంలో ఈ చర్చ కు ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం ఎనిమిది మంది మంత్రులు, సుమారు ఏభైఐదు మంది వరకు ఎమ్మెల్యేలకు మద్యం సిండికేట్లతో సంబంధం ఉంది. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇరవై తొమ్మిది మంది, తెలుగుదేశం ఎమ్మెల్యేలు పందొమ్మిది మంది, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురికి మద్యం సిండికేట్లతో సంబంధాలు ఉన్నాయని మీడియాలో కధనాలు వస్తున్నాయి,అన్ని పార్టీల నేతలకు ఏదో విధమైన సంబంధాలు మద్యం వ్యాపారులతో ఉండడం సహజంగానే పార్టీలకు ఇరకాటం అవుతుంది. పైకి ఆయా పార్టీల నేతలు ఏ డిమాండ్లు చేసినా లోపల మాత్రం వారికి గుబులుగానే ఉంటుంది.ఎవరి పేర్లు బయటకి వస్తాయా? ఎవరికి ఎలాంటి ఇబ్బంది వస్తుందా అన్న భయం అందరిలో వెన్నాడుతోంది. ఇదే సమయంలో ఎక్సైజ్ , పోలీస్ అధికారులు, మీడియా ప్రతినిదులకు కూడా వాటాలు ఉన్నాయన్నది వాస్తవంగా చెబుతున్నారు.ఈ పరిస్థితులలో అసలు విషయాలు బయటకు వస్తాయా? లేక ముఖ్యమంత్రి ఈ నివేదికను తన రాజకీయ అవసరాలకే వాడుకుంటారా అన్నది ఆసక్తికరం.అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతికి ఒక ఆయుధం దొరికిందన్నమాట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి