15, డిసెంబర్ 2011, గురువారం

గన్నవరం-బెంగళూరు మధ్య బోయింగ్ సర్వీస్ ప్రారంభం

విజయవాడ, డిసెంబర్ 15: గన్నవరం విమానాశ్రయానికి క్రమేణా విమాన సర్వీస్‌లు పెరుగుతున్నాయి. గురువారం నుంచి రెండో బోయింగ్ విమాన సర్వీస్ ప్రారంభమైంది. 134 సీట్ల సామర్థ్యంగల ఈ బోయింగ్ విమానం జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందినది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ఉదయం 11-55 నిమిషాలకు గన్నవరం చేరుకుంది. ఇక ప్రతిరోజూ బెంగుళూరులో ఉదయం 8-10 నిమిషాలకు బయలుదేరి 10.35 నిమిషాలకు గన్నవరం చేరుకుని తిరిగి ఇక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరుతుంది. తొలిరోజు 75 మందిరాగా 42మంది బయలుదేరివెళ్లారు. ఇటీవలే ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గన్నవరానికి ఎయిర్ ఇండియావారి బోయింగ్ విమానం సర్వీస్ నడుస్తోంది. అయితే ఎప్పుడు సర్వీస్ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇక స్పైస్ జెట్‌వారి రెండు విమానాలు గన్నవరం-హైదరాబాద్ మధ్య నడుస్తున్నాయి. అలాగే కింగ్‌ఫిషర్ విమానం ఒకటి గన్నవరం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు ఒక సర్వీస్ నడుస్తోంది. ఇవిగాక జెట్ ఎయిర్‌వేస్‌వారి మరో రెండు చిన్న విమానాలు గన్నవరం- హైదరాబాద్- బెంగుళూరు మధ్య నడుస్తున్నాయి. మొత్తంపై ఆరు విమానాలు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇక విశాఖ నుంచి సింగపూర్, దుబాయ్‌కు విమానాలు
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు దిగేందుకు ఇంకెంతకాలమో పట్టదు. వచ్చే ఏడాది మార్చి ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నం నుండి సింగపూర్, దుబాయ్‌కి విమానాలు నడిచేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీలో గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి గురువారం కేంద్ర విమానాయానశాఖామంత్రి వాయిలార్ రవితోను, ఎయిర్ ఇండియా చైర్మన్ రోహిత్ నందన్‌తో చర్చించారు. దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా సమ్మర్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనుంది విశాఖపట్నం-హైదరాబాద్-దుబాయ్-హైదరాబాద్-మదురై-సింగ్‌పూర్-మదురై-విశాఖపట్నం మధ్య ఎయిర్‌బస్-320 విమానం నడిచే అవకాశం ఉంది. విశాఖపట్నం-మదురై-సింగపూర్-మదురై-విశాఖపట్నం మధ్య కూడా ఓ సర్వీసును నడిపేందుకు ఎయిర్ ఇండియా ఆలోచన చేస్తోంది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి