సినీయర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున హీరోగా వస్తున్న 'రాజన్న' సినిమాకు వాయిస్ అందించారు. కొన్ని ముఖ్యమైన సీన్లలో అక్కినేని వాయిస్ అయితే పర్ ఫెక్ట్ గా ఉంటుందని భావించిన దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ పట్టుబట్టమరీ ఆయనతో ఈ పని చేయించారు. రాజన్న సినిమా ప్రివ్యూను నాగార్జునతో పాటు సినిమాకు సంబంధించిన ముఖ్య వ్యక్తులంతా నిన్న చూశారు. సినిమా మొత్తం డ్యూరేషన్ 2 గంటల 14 నిమిషాలు ఉంది. సరిగ్గా ఇంటర్వెల్ కు 18 నిమిషాల ముందు నాగార్జున ఎంట్రీ ఉందని ప్రివ్యూ చూసిన వారి నుంచి అందిన సమాచారం. కీవరాణి అందించిన ఆడియో అద్భుతంగా వచ్చిందని, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయనే టాక్ వినిపించింది.
నాగార్జున కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ప్రిప్యూ చూడగానే సినిమా హిట్టా...ఫట్టా అనే విషయం తేలి పోతుంది. రాజన్న సినిమా విజయం సాధించడం ఖాయం అన్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆసక్తికరమైన కథతో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు సంతృప్తిని ఇస్తుందని అన్నారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న ఇండియాలో విడుదలవుతుండగా, అమెరికాలో ఒక రోజు ముందుగా డిసెంబర్ 21న విడుదలవుతోంది
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి