* ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలుతుందని ప్రకటన
* టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలు కాంగ్రెస్ లో కలుస్తాయని జోస్యం
* రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు ఊడిగం చేస్తున్నారన్న బాబు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోతుందని కార్యకర్తలు ఎన్నికలకు రెడీగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు భవిష్యత్‌లో కాంగ్రెస్‌లో కలిసిపోతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయని టీఎన్‌టీయూసీ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్న సీఎం కిరణ్ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు ఊడిగం చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి