19, డిసెంబర్ 2011, సోమవారం

తగ్గనున్న బంగారం ధరలు!

వచ్చే మూడు నెలల్లో బంగారం ధరలు మరో 10 శాతం దాకా తగ్గవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1600 డాలర్లకు సమీపంలో ఉంది. ఈ ధర 1450 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని రాయిటర్స్‌ నిర్వహించిన పోలింగ్‌లో హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్లు, ఆర్థికవేత్తలు, గోల్డ్‌ ట్రేడర్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటికే బంగారం ధర 10 శాతానికి పైగా పడింది.

 

యూరోపియన్‌ బ్యాంకులకు నిధుల కొరత కారణంగా బంగారాన్ని అమ్ముతున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. 2012లో అన్ని రకాల మెటల్స్‌ కంటే బంగారం పరిస్థితి దారుణంగా ఉంటుందని స్విట్జర్లాండ్‌‑కు చెందిన ఓ విశ్లేషకుడు తెలిపారు. 2014 దాకా బంగారం కొత్త రికార్డులను సృష్టించే అవకాశం లేదని, అంతర్జాతీయ మార్కెట్లో అంచనా వేసినట్లు బంగారం ధర పడితే 10 గ్రాముల బంగారం ధర వచ్చే మూడు నెలల్లో 25 వేల రూపాయలకు వచ్చే అవకాశం ఉందని అంచనా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి