* స్వల్ప సంఘటనలు మినహా బాబుకు ఆదరణ
* టీఆర్‌ఎస్ కేడర్‌కు టీడీపీ వార్నింగ్
* వరంగల్, కరీంనగర్, మెదక్ యాత్రకు రూట్‌మ్యాప్
* 24 నుంచి బాబు తుది విడత పాదయాత్రకు ప్లాన్
* చంద్రబాబుపై చెప్పు విసిరిన TRS కార్యకర్త
* జక్రాన్‌పల్లి బహిరంగసభలో రగడ
* TRS నేత చెన్నారెడ్డిని చితక్కొట్టిన టీడీపీ కేడర్
* టీఆరెస్ పై చంద్రబాబు నిప్పులు
* బెదిరింపులు పనిచేయవని అల్టిమేటం
తెలంగాణ ఉద్యమంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న చంద్రబాబు రైతుపోరాట యాత్రతో ధైర్యంగా ఈ ప్రాంతంలో కాలు మోపారు. గతంలో ఉద్యమ ప్రభావం అంతగాలేని దక్షిణ తెలంగాణలో పర్యటించగా..తాజాగా ఉద్యమానికి కంచుకోట లాంటి ఉత్తర తెలంగాణలోనూ టూరేసి సక్సెసయ్యారు. అక్కడక్కడా కొంత ప్రతిఘటన ఎదురైనా ఓవరాల్ గా బాబు టూర్ బంపర్ హిట్ అయిందని తెలుగు తమ్ముళ్లు తెగ ఖుషీ అవుతున్నారు. ఉత్తర తెలంగాణలో TDP అధినేత చంద్రబాబు చేపట్టిన రైతుపోరుబాట పాదయాత్ర స్వల్ప ఉద్రిక్తతల మధ్య విజయవంతంగా ముగిసింది. ఆదిలాబాద్ లో సజావుగానే సాగిన టూర్.. నిజామాబాద్ జిల్లాలో మాత్రం పలుచోట్ల బాబుకు నిరసనలు తప్పలేదు.
ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ నుంచి మొదలైన పాదయాత్ర కోలిప్యాక, మనోహరాబాద్ మీదుగా జక్రాన్ పల్లి వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పంటపొలాల్లో ఆగి ఎర్రజొన్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతుయాత్ర ముగింపు సందర్భంగా జక్రాన్‌పల్లి బహిరంగ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. TRS కార్యకర్తలు చంద్రబాబుపైకి చెప్పు విసరడంతో టీడీపీ కార్యకర్తలు వారిని చితక్కొట్టారు. రైతుయాత్రను రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అటు.. సభను అడ్డుకోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పార్టీలు నశించాలని పిలుపివ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. టీఆరెస్ ఎన్ని కుట్రలు పన్నినా వాటిని తిప్పికొడతామని.. ఇలాంటి వాటికి బెదిరే సమస్యే లేదని బాబు స్పష్టం చేశారు. తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తూనే రైతు సమస్యలు, ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టడంలో బాబు సఫలీకృతులయ్యారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపిచ్చారు. 2004లో ఉచిత కరెంటు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని.. ప్రజా కంటకుల చేతిలోకి పాలన వెళ్లేది కాదని బాబు ఆత్మనింద చేసుకున్నారు.
మొత్తం మీద తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రైతుసమస్యలపై పోరుబాట చేపట్టి పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అధినేత చేపట్టిన ఈ యాత్ర ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అటు టూర్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు కూడా ఖుషీగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టూర్ సక్సెస్ కావడంతో వరంగల్, కరీంనగర్, మెదక్ యాత్రకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు బాబు. రానున్న ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో TDP బలోపేతానికి బాబు యాత్ర బూస్ట్‌లా పనిచేస్తుందని పచ్చదండు బలంగా నమ్ముతోంది.
16, డిసెంబర్ 2011, శుక్రవారం
బాబు ప్లాన్ సక్సెస్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి