* సీఎం తీరుతో మంత్రుల్లో అసహనం
* శాంతి భద్రతల రివ్యూకి మంత్రుల్ని రావద్దన్న CM పేషీ అధికారి
* నొచ్చుకున్న పలువురు మంత్రులు
* కేబినెట్ నిర్ణయాలకు సమిష్టి బాధ్యత తీసుకుంటున్నాం...
* మరి ఈ విషయంలో మమ్మల్ని ఎందుకు పక్కకుపెడతారు: మంత్రులు
* సీఎం తీరుపై పరోక్షంగా పలువురు మంత్రుల విమర్శలు
సీఎంకి మంత్రులకూ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న వాదన మరింత బలపడుతోంది. తాజాగా.. జూబ్లీహాల్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. శాంతి భద్రతల సమస్యపై జిల్లా ఎస్పీలతో సీఎం రివ్యూ చేశారు. హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి మినహా మిగతా మంత్రులంతా ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్లాలంటూ సీఎం పేషీ అధికారి చెప్పడంతో వివాదం రాజుకుంది. ఐఏఎస్ అధికారి మాటలకు నొచ్చుకున్న మిగతా మంత్రులంతా బయటకు వచ్చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి