2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో హోంమంత్రి చిదంబరం పాత్రపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి శనివారం తన వాదనలను ప్రారంభించారు. ఈ కేసులో చిదంబరంను సహ ముద్దాయిగా జాబితాలో చేర్చాలని ఆయన న్యాయస్థానాన్ని కోరనున్నారు.
రాజాతో పాటు చిదంబరం కూడా కుమ్మక్కై... ఈ అక్రమాలలో పాలు పంచుకున్నాయనడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించనున్నారు. అలాగే ఈ కేసులో ఇద్దరు కీలక ప్రభుత్వాధికారులను విచారించడానికి తనను అనుమతించాలని ఆయన కోరనున్నారు. సుబ్రహ్మణ్య స్వామి వాదన విన్న అనంతరం కోర్టు సాక్ష్యుల అనుమతిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి