16, డిసెంబర్ 2011, శుక్రవారం

పది సీట్లు వస్తే తడాఖా చూపేవాణ్ని

 అసెంబ్లీలో నాకు పది సీట్లు వచ్చి ఉంటే తడాఖా చూపేవాడినని ప్రస్తుతం ఒక్క సీటుతోటే 25 శాతం రాష్టవ్య్రాప్తంగా తన ప్రభావాన్ని ప్రజలకు వద్దకు చేర్చగలిగానని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ పేర్కొన్నారు. ఖమ్మంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన వారిని లోక్‌పాల్‌ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చి వారి ఆస్తులను జప్తు చేసే విధంగా బలిష్టంగా ఉండాలని సూచించారు. మైనింగ్‌లో బహిరంగ వేలంపాట ద్వారానే సహజ వనరులను చట్ట బద్దంగా దక్కించుకోవాలని అలాంటి విధానాలను అనుసరించాలని సూచించారు.

 

చిన్నపాటి పదవులను చేజిక్కించుకుని వారసత్వ రాజకీయాలతో కోట్ల రూపాయలను గడిస్తున్న వారికి సమాజంలో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. జయప్రకాష్‌ నారాయణ ప్రసంగాన్ని టీఆర్‌ఎస్‌కు చెందిన 8 మంది కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా పోలీసు వాహనంపై కోడి గుడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన ఎనిమిది మందిని జిల్లా కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి