16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఎన్టీఆర్-కేసు కొట్టివేత

 ఎన్టీఆర్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సూర్య పేట కోర్టులో శనివారం హాజరయ్యారు. 2009 ఎన్నికల సమయంలో జూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రచారం ముగించుకుని తన స్నేహితులు రాజీవ్ కనకాల తదితరులతో వాహనంలో హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మోతె సమీపంలో యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలపాలైన జూనియర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు. తాజాగా ఈరోజు ఆ కేసు విచారణకు సంబంధించి జూ ఎన్టీఆర్ సూర్యపేట కోర్టుకు హాజరుకాగా ఈ కేసును కోర్టు కొట్టి పారేసింది. కేసు కొట్టివేయడంతో కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో సంతోషం నెలకొంది.

 

కేసు నుంచి ఉపశమనం లభించడంతో ఇకపై హ్యాపీగా జూనియర్ ఎన్టీఆర్ షూటింగుల్లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం జూనియర్ బోయపాటి దర్శకత్వంలో 'దమ్ము' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి