అవినీతి వ్యతిరేక ఉద్యవుకారుడు అన్నా హజారే ఆదివారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని ఫోర్‌ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్‌లో తన బృందంతో కలసి ముదలవర్ మహాత్మా (ముఖ్యమంత్రి మహాత్ముడు) అనే సినిమాను చూడనున్నారు. తమిళ దర్శకుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. హజారే చెన్నైకి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ ఆయనకు సినిమా కథను వినిపించారు. దేశంలో పెరిగిపోయిన అవినీతి, ఆర్థిక క్షీణతలను గాంధీజీ ఆత్మ రూపంలో వచ్చి చూస్తారు.
ఆ పరిస్థితులు చూసి ఆవేదన చెంది దేవుడి వద్ద మొర పెట్టుకుంటారు. దేవుడు గాంధీజీని మళ్లీ పుట్టించడంతో ఆయన రాజకీయూల్లో మార్పులు తీసుకొస్తారు. ఇదీ ఆ సినిమా కథ. హజారే ఆ కథ విని చిత్రాన్ని చూసేందుకు అంగీకరించారు. కాగా, హజారే 40 ఏళ్ల తర్వాత సినిమా చూడనున్నారని థియేటర్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
16, డిసెంబర్ 2011, శుక్రవారం
చెన్నైలో సినిమా చూడనున్న హజారే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి