19, డిసెంబర్ 2011, సోమవారం

మంత్రి శంకరరావుపై కోడిగుడ్లు,టమోటాలు

రాష్ట్ర మంత్రులు శంకరరావు,సబితా ఇంద్రారెడ్డిల మధ్య వర్గ పోరు బహిర్గతమైంది. శంకరరావు ఎన్.టి.ఆర్. నగర్ లో భూ కబ్జాలను పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ స్థానికులు కొందరు శంకరరావుపై కోడిగుడ్లు విసిరారు. వీరు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్గీయులుగా భావిస్తున్నారు. శంకరరావు గతంలో సబితా ఇంద్రారెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యత ఏర్పడింది.శంకరరావుపైనే భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని, ఆయన వచ్చి ఇక్కడ చూసేదేమిటంటూ కొందరు కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. దీంతో శంకరరావును ఒక గదిలోకి తీసుకు వెళ్లి పోలీసులు భద్రత కల్పించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి