25, డిసెంబర్ 2011, ఆదివారం

కెసిఆర్‌ కు సోనియా కౌంటర్?

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యూహానికి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాత్రమే కాకుండా కె. చంద్రశేఖర రావును కూడా దీటుగా ఎదుర్కోనేందుకు అవసరమైన వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడంపై వారిద్దరి వైపు కాంగ్రెసు వేలెత్తి చూపే అవకాశం ఉంది. కెసిఆర్ వ్యవహారశైలి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనువుగా లేదనే ప్రచారాన్ని కాంగ్రెసు ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. తెరాసను తమ పార్టీలో విలీనం చేస్తే తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పామని, అయితే కెసిఆర్ అందుకు సుముఖంగా లేరని కాంగ్రెసు అధిష్టానం తన పార్టీ తెలంగాణ నాయకుల చేత సమరం చేయించే అవకాశం ఉంది. 

నిజానికి, కాంగ్రెసు అధిష్టానం కెసిఆర్‌ను నవంబర్‌లో సంప్రదించిందట. తెరాసను విలీనం చేస్తే తెలంగాణ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పిందని అంటున్నారు. అయితే, కెసిఆర్ అందుకు అంగీకరించలేదని అంటున్నారు. దీంతో వెనక్కి తగ్గినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి రెండు ప్రాంతాల్లో తమ పార్టీని పోగొట్టుకోలేం కదా అనే వాదనను కాంగ్రెసు నాయకులు ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. కెసిఆర్‌కు తెలంగాణ కన్నా పార్టీ ముఖ్యంగా మారిందని, రాజకీయ ప్రయోజనాలే కెసిఆర్‌కు ముఖ్యమని కాంగ్రెసు నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేసే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి