ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టర్ల సదస్సు సందర్భంగా మంత్రులను బయటకు పంపించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ప్రత్యేకించి శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా మిగిలిన మంత్రులు అవసరం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ అదికారులు ఒక్క హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్ప మిగిలినవారిని సమావేశం మందిరం నుంచి వెళ్లిపోవాలని కోరడంపై మంత్రులు సహజంగానే అసంతృప్తి చెందుతారు. అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే ముందుగానే అందరికి ఆ సమాచారం పంపి ఉండాల్సింది. అప్పుడు మంత్రులు ఎవరూ సమావేశ హాలు వరకు వచ్చి ఉండేవారు కారు. అలాకాకుండా మంత్రులు అక్కడికి వచ్చాక మంత్రులకు అలా చెప్పడం వల్ల జిల్లా కలెక్టర్లు, ఐపిఎస్ ల వద్ద వారు చిన్నతనంగా కినిపిస్తుంది. అది మంచి పరిణామం. ఇలాంటి విషయాలలో ముఖ్యమంత్రి పేషీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముఖ్యమంత్రికి ఎలాంటి ఇరకాట పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని అలా తీసుకున్నట్లు లేరు. మంత్రి శంకరరావు మిగిలిన మంత్రులు వెళ్లినా ఆయన అక్కడే కూర్చుని ఉండడం, అదికారులు వెళ్లి బయటకు వెళ్లాలని కోరడం, ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లడం ఇదంతా ప్రభుత్వానికి మంచి పద్దతికాదని చెప్పాలి. కిరణ్ పేషీ అనుభవ రాహిత్యం వల్ల ఇది జరిగి ఉంటుందన్న అభిప్రాయం కలుగుతుంది.భవిష్యత్తులోనైనా ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గతంలో కేవలం ప్రారంభ, ముగింపు సమావేశాలకు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి తన సందేశాలను ఇచ్చేవారు. కాని చంద్రబాబు హయాం నుంచి ఇవి మూడు రోజుల మరాధాన్ సదస్సుల మాదిరి, మంత్రులు, అధికారులు అంతా మేధోమధనం జరుపుతున్నట్లు చేయడం ఆరంభమైంది. చివరిగా కలెక్టర్లు, ఎస్.పిలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయన ఛాంబర్ లో ఒక్కక్కరుగా కలిసేవారు. అలా ఇప్పుడు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేది.మరి ఎందువల్లనో మంత్రులకు అసౌకర్యం కలిగేలా ఘటన జరగడం సరికాదనే చెప్పాలి.
15, డిసెంబర్ 2011, గురువారం
కిరణ్ కుమార్ రెడ్డి పేషీ అనుభవ రాహిత్యమా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి