ఎక్సైజ్ శాఖ మంత్రిపై ఆరోపణలు వచ్చినందున ఆ పదవి నుంచి ఆయనని తప్పించి, విచారణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మద్యం వ్యాపారలపై దాడులు రాజకీయ గుత్తాధిపత్యం కోసం ముఖ్యమంత్రి అడుతున్న నాటకం అని ఆమె విమర్శించారు. మద్యం సిండికేట్లకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఈ దాడులు జరగడంలేదన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారాలపై తక్షణం సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎపిపిఎస్‑సి గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఆమె కోరారు. అనువాద తప్పిదాల వల్ల అభ్యర్థులు నష్టపోయినట్లు తెలిపారు. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసి, అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి