5, డిసెంబర్ 2011, సోమవారం

బెజవాడ ఫస్ట్ డే కలెక్షన్స్ 2.18 cr

‘బెజవాడ’. వివేక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు కలెక్షన్లు మాత్రం చాలా ఆవరేజ్‌గా ఉన్నాయి. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బెజవాడ సినిమా తొలి రోజు రూ. 2.18 కోట్ల కలెక్షన్లు సాధించింది. కృష్ణ, గుంటూరు, విశాఖలో కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ.... నైజాం, సీడెడ్ లలో మాత్రం చాలా పూర్ కలెక్షన్లు వచ్చాయంటున్నారు. ఏది ఏమైనా ఓపెనింగ్ కలెక్షన్లు ఇలా ఉండటానికి తోడు సినిమా టాక్ కూడా బాగోలే పోవడంతో సినిమా విజయాన్ని అందుకుంటుందో? లేదో? అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. తొలి వారం రోజులు గడిస్తే గానీ సినిమా భవిత్యం ఏమిటో తేలి పోతుంది.

బెజవాడ రౌడీరాజకీయాల నేపథ్యంలో సినిమా ఉంటుందని, ఏవేవో ఆసక్తికర అంశాలు ఉంటాయని ఊహించుకుని సినిమాకు వెళ్లిన వారు అందులో తాము ఆశించిన అంశాలు ఏమీ లేక పోగా, సినిమాలో కొత్తదనం లేక పోవడమే ఇలాంటి పరిస్థితికి కారణం అంటున్నారు. అయితే సినిమాలో మాత్రం నాగ చైతన్య నటన అందరినీ ఆకట్టుకుంటోంది. మాస్ హీరో అయ్యే లక్షణాలు నాగచైతన్యలో పుష్కలంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి