మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన గొడవల్లో అనేక వందల మంది సిక్కు యువకులు ఊచకోతకు గురైన విషయం తెలిసిందే. ఇందిర తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురి కావడమే ఇందుకు కారణం. ఈ గొడవలు అమితాబ్ కారణంగానే జరిగాయని, ఆయన రెచ్చగొట్టుడు వ్యాఖ్యల వల్లనే మారణ హోమం జరిగిందని సిక్కు సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఆయపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇందిరా గాంధీ అభిమాని, ఆమెను అమ్మగా ఆరాధించే అమితాబ్....ఆమె మరణం తర్వాత హత్యకు హత్యే ప్రతీకారం అంటూ సిక్కులకు వ్యతిరేకంగా స్లోగన్లు చేశాడనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు.
ఈ కేసులో మరొకరు అమితాబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారు. 52 సంవత్సరాల మంజిత్ సింగ్ అనే వ్యక్తి అమితాబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి రెడీ అయ్యారు. అమితాబ్ సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారు మంజిత్ సింగ్. అమితాబ్ పై చర్యలు తీసుకోవాలంటూ గత కొంత కాలంగా సిక్కు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. మరి ఈ వ్యవహారం ఇంకెంత వరకు వెలుతుందో? నిజంగానే అమితాబ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనేది కాలమే నిర్ణయించాలి.
15, డిసెంబర్ 2011, గురువారం
అమితాబ్ వివాదం లో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి