8, డిసెంబర్ 2011, గురువారం

panja talk...?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఈ రోజు ప్రపంచమంతటా భారీ ఎత్తున అభిమానుల సంబరాలతో విడుదల అయ్యింది. ఈ చిత్రం చూసిన కొందరు యావరేజ్ అని అంటున్నారు. మరికొందరు స్టైలిష్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కటానకి కొంత టైమ్ పట్టచ్చు అని చెప్తున్నారు. అభిమానులు మాత్రం పవన్ కెరీర్ లోనే సూపర్బ్ ఫిలిం అంటున్నారు. పరిశ్రమ వర్గాలు అయితే బి,సి సంగతేమో కానీ సిటీలలోని అర్బన్ యూత్ కి బాగా నచ్చుతుందని చెప్తున్నారు. అలా రకరకాలుగా ఈ చిత్రం గురించి టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇక ఈ చిత్రం కథానుసారంగా చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరు జయదేవ్‌. అయితే అందరూ జై అంటుంటారు. కలకత్తా మాఫియా నేపథ్య కథా చిత్రమిది. ఇందులో మాఫియా మెంబర్‌గా పవన్‌ కల్యాణ్‌ నటించారు. అందమైన ప్రేమకథ ఉంది. మంచి కామెడీ ఉంది. బ్రహ్మానందం, అలీ తమదైన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తురు. ఎక్కడా లెంగ్తీ డైలాగ్స్‌ ఉండవు. ఇక యాక్షన్‌ అనగానే సుమోలు లేచిపోవడం వంటివి కాకుండా చిత్ర కథపరంగా ఎక్కడ ఏది ఎంత అవసరమో అక్కడ అది అంత మోతాదులోనే ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌ చిత్రమనగానే ఉన్న ఎన్నో అంచనాలును రీచ్ అవుతుంది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో సినిమాని విడుదల చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి