4, డిసెంబర్ 2011, ఆదివారం

జగన్ కె.సి.ఆర్ మిలాకత్ ..........!?


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మంతనాలు జరుపుతున్నారని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె కేశవ రావుతోనూ జగన్, కెసిఆర్ నిత్యం ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పటికే కెసిఆర్ జగన్ వర్గానికి చెందిన కోమటిరెడ్డి సోదరుల గ్రూపుతో నిత్యం టచ్‌లో ఉంటున్నారట. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని కూల్చి వేయడం ద్వారా తెలంగాణలో టిఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ లబ్ధి పొందేందుకు ఇద్దరు కలిసి సాధ్యమైనంత మంది ఎమ్మెల్యేలను అవిశ్వాసానికి మద్దతుగా కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వానికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై మంది కాంగ్రెసు, పిఆర్పీ ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కోవడానికి కెసిఆర్, జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట. 6గురు పిఆర్పీ అసంతృప్త ఎమ్మెల్యేలతో ఇప్పటికే జగన్ గ్రూపు మాట్లాడిందని అందుకే విప్ జారీ వద్దంటూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. మరోవైపు కెసిఆర్ సుమారు పన్నెండు మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారట. జగన్ కూడా తన వర్గానికి చెందిన కోమటిరెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి