4, డిసెంబర్ 2011, ఆదివారం

చిరంజీవికి అదిష్టానం నుండి ఫోన్!

పీఆర్పీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాం నబీ ఆజాద్ గత రాత్రి నుంచి చిరంజీవితో ఫోన్ లో మంతనాలు జరుపుతూ బుజ్జగింపుల పర్వం చేపట్టారు. పదవుల భర్తీలో పీఆర్పీకి ప్రాధాన్యత ఇస్తామని ఆజాద్ హామీ ఇవ్వటంతో పాటు పార్టీలో సరైన గుర్తింపు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ రోజు  చిరంజీవికి సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి  చిరంజీవితో ఆహ్మద్ పటేల్ కూడా  ఫోన్‌లో సంభాషించినట్టు సమాచారం. ప్రభుత్వానికి పజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు బాసటగా నిలువాలని... అధిష్టానం మాటగా కూడాతెలియచేయాలని చిరంజీవికి పటేల్ సూచించినట్టు తెలిసింది. దాంతో మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో చిరంజీవి భేటి కానున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి