అసెంబ్లీలో నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక సంఘటన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయతకు, విలువలకు వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు అర్థం చెప్పారన్నారు. తమ పదవులు పోతాయని తెలిసినా రైతుల పక్షాన నిలబడిన ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని వైఎస్ జగన్ అన్నారు.
అధికార పార్టీలో ఉండి ప్రజల తరపున నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసి వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు కొత్త రాజకీయాలకు నాంది పలికారన్నారు. తనకు తోడు నిలిచిన ఎమ్మెల్యేలను చూసి తాను గర్వపడుతున్నానని ఆయన అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యేలతో ప్రజలలో వెళతానని జగన్ తెలిపారు.
రైతు సమస్యలపై కనీస అవగాహన లేనివారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ మీద విమర్శలకే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభలో నిన్న ఎక్కువ సమయం కేటాయించారని ఆయన విమర్శించారు. అసలు రైతు సమస్యలపైనే చర్చ జరగకపోవటం బాధాకరమన్నారు. గ్రామాల్లోకెళితే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. పత్తి, పొగాకు, చెరకు, వరి పండిస్తున్న రైతులు అష్టకష్టాలు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు.
మరోవైపు సాక్షాత్తు అసెంబ్లీ వేదిక చేసుకుని కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు దిగారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తనకు అండగా ఉన్న ఎమ్మెల్యేలను ప్రలోభాల పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారని, లొంగకపోవటంతో బెదిరింపులకు దిగటం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యేలపై ఒకేసారి అనర్హత వేటు వేయాలన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి