6, డిసెంబర్ 2011, మంగళవారం

జగన్ జయలలిత ని ఫాలో అవుతున్నాడా ......

జయలలిత లాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ  మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. జయలలిత కూడా తన సొంత మీడియా నేషనల్ మీడియా తోనే మాట్లాడుతుంది.మరి ఏ ఇతర ప్రాంతీయ
మీడియా తో మాట్లాడదు.జగన్ తన వర్గం శాసనసభ్యులతో కలిసి ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తొలుత మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తాను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పారు. అయితే, తెలుగు మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. జాతీయ మీడియా కోసం మాట్లాడతానంటూ వెళ్లిపోయారు. జాతీయ మీడియా ప్రతినిధులతో ఆంగ్ల భాషలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. తన యాజమాన్యంలో నడుస్తున్న సాక్షి దినపత్రికపై చెప్పారు.

జాతీయ మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి పెట్టుబడులపై, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో సంబంధాలపై, తన ఆస్తులపై సిబిఐ విచారణ మీద, తన ఢిల్లీ పర్యటనపై, కాంగ్రెసు అధిష్టానంతో తాను కమ్మక్కయినట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సాక్షి మీడియాలో పెట్టుబడుల గురించి ప్రశ్నించే నైతికత ఎవరికీ లేదని ఆయన అన్నారు. సిపిఐ తనను వేధించినా అదో సమస్య కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కుమ్మక్కయ్యారని ఆయన విమర్సించారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో తన పేరు లేదని ఆయన స్పష్టం చేశారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి