12, డిసెంబర్ 2011, సోమవారం

బొత్సకు అధిష్టానం ఝలక్

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాంగ్రెస్ అధిష్టానం విశ్వసించడం లేదా ? పార్టీలో ఉంటూనే బొత్స తన ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాడని, కిరణ్ కు అడ్డుగా మారుతున్నాడని అధిష్టానం భావిస్తోందా ? అవిశ్వాసం సమయంలో చిరంజీవి అలక వెనుక బొత్స హస్తం ఉందని అధిష్టానం అనుమానిస్తోందా ? అందుకే అధిష్టానం బొత్సను దూరం పెడుతోందా ?

అవును అవిశ్వాసం సమయంలో చిరంజీవి అలకపాన్పు ఎక్కడం ఇప్పుడు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మెడకు చుట్టుకుంది. చిరంజీవి వెనుక బొత్స హస్తం ఉందని అధిష్టానం భావిస్తోంది. గత మూడురోజులుగా హస్తినలో అధిష్టానం పెద్దలను బొత్స కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అధిష్టానం పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. అసలు బొత్సను కలిసేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. పలు కీలక విషయాల గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన అధిష్టానం అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం పై అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ ను ఇరుకున పెట్టి అధిష్టానం వద్ద తన పలుకుబడిని పెంచుకునేందుకు బొత్స సత్యనారాయణ వేస్తున్న ఎత్తులు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీని బలహీన పరిచేలా బొత్ప వ్యవహరిస్తున్నారని అధిష్టానం భావిస్తోంది. దీనికితోడు చిరంజీవి వ్యవహారం విషయంలో మరింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమయిన అవిశ్వాసం సమయంలో చిరంజీవి చేసిన డిమాండ్లు, బొత్స చిరు వెనుక ఉన్నట్లు వచ్చిన సమాచారం అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. మరి బొత్స అధిష్టానాన్ని చల్లబరుస్తారా ? తన తప్పేంలేదని నిరూపించుకుంటారా ? వేచిచూడాలి.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి