రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలి చేస్తే టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ జెఏసి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌లకు కానుకలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, రమణ మంగళవారం విమర్శించారు. తెలంగాణను కోదండరామ్ అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో చంద్రబాబును అడ్డుకోవాలని పిలుపునివ్వడం సరికాదన్నారు. కెసిఆర్, కోదండరామ్ లకు బాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణపై ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
జగన్ అన్యాయాన్ని నమ్ముకుంటే చంద్రబాబు న్యాయాన్ని నమ్ముకున్నారని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన అనంతరం అన్నారు. ఇది తమకు పాక్షిక విజయమేనని అంతిమ విజయం కూడా తమనే వరిస్తుందన్నారు. జగన్ తాను కేసు నుండి తప్పించుకోవడానికే బాబుపై కేసు వేయించారన్నారు. ఆయన కేంద్రంతో లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. బాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి