17న తిరిగి రాక తరువాతే అనర్హత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ
హైదరాబాద్, డిసెంబర్ 13: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. తిరిగి 17 ఉదయం నగరానికి చేరుకుంటారు. జగన్ వర్గానికి చెందిన 16మంది ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి సోమవారం రాత్రి ఇచ్చిన అనర్హత ఫిర్యాదుపై సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి స్పీకర్ వచ్చిన తర్వాతే ప్రారంభించవచ్చని శాసనసభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. 'మాస్టరింగ్ ది బడ్జెట్' అన్న అంశంపై ఢిల్లీలో 15, 16 తేదీల్లో రెండు రోజుల సదస్సు జరగనుంది. సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారు. సదస్సులో మాట్లాడేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఆహ్వానం అందింది. ఈమేరకు స్పీకర్ మనోహర్ బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్తున్నారు. శాసనసభ కార్యదర్శి రాజ సదానందం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు కేసుకు హాజరు కావాల్సి ఉండటంతో అనర్హత ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం సాధ్యపడలేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి