విపక్ష, భాగస్వామ్య పార్టీల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్న నేపథ్యంలో ఎఫ్ డీఐలపై కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఏకాభిప్రాయం కుదిరేవరకూ ఎఫ్ డీఐలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దాంతో పార్లమెంటును నిర్వహించేందుకు అఖిలపక్షం అంగీకారం తెలిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి