నాలుగు రోజుల విరామం అనంతరం గుంటూరు జిల్లాలో తిరిగి ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం పొన్నూరు మండలం ములుకుదురు గ్రామం నుంచి యాత్రను ప్రారంభించారు. ములుకుదురు, బోడిపాలెం, నండూరు మీదుగా మొత్తం 10 గ్రామాలు పర్యటించి సాయంత్రం పొన్నూరు పట్టణంలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.
రాత్రి సికింద్రాబాద్ నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వైఎస్ జగన్ కు బుధవారం తెల్లవారుజామున బాపట్ల రైల్వేస్టేషన్ లో అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కాగా బోడిపాలెం మార్గంలో రైతులు ధాన్యానికి మద్దతు ధర లేదంటూ అన్నదాతలు తమ గోడు వెళ్లబుచ్చారు. ధాన్యానికి మద్దతు ధర కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి