వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పదిహేడు మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద వేటు వేస్తే అది దేశ చరిత్రలోనే రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు ఇంత ఎక్కువ మందిపై ఒకేసారి వేటు వేసిన దాఖలాలు లేవు. కాంగ్రెసు(16), పిఆర్పీ(1) ఫిర్యాదు మేరకు వారి శాసనసభ్యత్వాలు రద్దయితే మాత్రం రికార్డ్ అవుతుంది.
గతంలో ఉత్తర ప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ)కి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి సభ్యత్వాలు రద్దయ్యాయి. తాజాగా జగన్ ఎమ్మెల్యేలపై కాంగ్రెసు ఫిర్యాదు చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి