ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసులో హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇవ్వడం ఆయనకు పెద్ద ఉపశమనంగానే భావించాలి. తుది విచారణ బుధవారంనాడు కొనసాగనున్నప్పట్టికీ స్టే ఉత్తర్వులు కొనసాగడానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, రికార్డుస్థాయిలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఈ ఆస్తుల కేసు పెద్ద తలనొప్పిగానే ఉందని చెప్పాలి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటిషన్ ఆధారంగా తాత్కాలిక ఛీఫ్ జస్టిస్ గులాం అహ్మద్ బెంచ్ సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వగా ,తమ వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని చంద్రబాబు న్యాయవాదులు వాదించారు.దీనిపై సుప్రింకోర్టు వరకు వెళ్లగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. కాగా దానిపై హైకోర్టులో వెకేట్ పిటిషన్ వేయగా రెండు బెంచ్ లు మారి స్టే లభించింది. అయితే తనపై వచ్చిన అభియోగాలపై విచారణ ఎదుర్కోకుండా స్టే పొందారని చంద్రబాబుపై విమర్శలు రావచ్చు. కాని ఆ విమర్శల కన్నా సిబిఐ విచారణ పెద్ద చికాకు కలిగిస్తుంది. అందువల్ల స్టే పొందడమె బెటర్ అని భావించవచ్చు.
13, డిసెంబర్ 2011, మంగళవారం
చంద్రబాబుకు పెద్ద ఉపశమనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి