ఇప్పుడు ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తారకరత్నకు డూ ఆర్ డై సిట్యువేషన్ వచ్చింది. ఆయన తాజా చిత్రం నందీశ్వరుడు డిసెంబర్ మూడవ వారంలో అంటే నాగార్జున రాజన్న విడుదల రోజే రిలీజ్ అవుతోంది. వరస ఫ్లాపులతో కెరీర్ ని గెంటుకొస్తున్న తారకరత్న ఈ చిత్రంతో నిలదొక్కుకోకపోతే మళ్లీ మరో సినిమా రావటం చాలా కష్టం. అదే ఈ సినిమా కనుక హిట్టైతే మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తారకరత్న భాక్సాఫీస్ వద్ద ప్రయత్నాలు చేయటానికి అవకాశం లభిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణ,కళ్యాణ్ రామ్ సరసన నిలబడి హీరోగా తొడలు కొట్టే ఛాన్స్ వస్తుంది. నందమూరి తారకరత్న హీరోగా శ్రీను యరజాల(అంజి శ్రీను)దర్శకత్వంలో కోట ఫిలిం కార్పొరేషన్, ఎస్.ఆర్.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోట గంగాధరరెడ్డి, సేగు రమేష్‌బాబు సంయుక్తంగా 'నందీశ్వరుడు'చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి చెపుతూ..
ఈ నెల 23న విడుదల చేయాలనే దృఢ సంక్పలంతో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగవంతం చేశాం. తారకరత్న కెరీర్‌కే పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం అన్నారు.పోలీసింగ్‌కు, సివిల్ పోలీసింగ్‌కు మధ్య జరిగే గొప్ప ఐడియాలజీ కాన్‌ఫ్లిక్ట్ ఈ సినిమాకు మూలం. 'డెడ్లీ సోమా' అనే కన్నడ చిత్రం ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఫొటోగ్రఫీ: సుధాకరరెడ్డి, సంగీతం: పార్థు, ఎడిటింగ్: కృష్ణారెడ్డి, ఫెట్స్: థ్రిల్లర్ మంజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యువరాజ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి